Israel Palestina Crisis: హమాస్ దాడిలో 40 మంది మృతి, 500కు పైగా గాయాలు.. ఇజ్రాయెల్‭లో చల్లారని ఉద్రిక్తతలు

ఈ దాడి అంనతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. యుద్ధం వాళ్లు ప్రారంభించారని, దానికి వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు

Israel Palestina Crisis: హమాస్ తీవ్రవాద సంస్థ దాడి అనంతరం ఇజ్రాయెల్ లో సుమారు 40 మంది మృతి చెందినట్లు, అలాగే 500 మందికి పైగా గాయపడ్డట్టు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. శనివారం తెల్లవారు జామునే ఇజ్రాయెల్ వైపు గాజా కేంద్రంగా ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థ సుమారు 5,000 రాకెట్లు ప్రయోగించినట్లు స్వయంగా వాళ్లే వెల్లడించారు. ఈ దాడులే కాకుండా ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి ఇష్టారీతిని కాల్పులు జరిపారు, కొంత మంది ఇజ్రాయెలీలను అపహరించుకుపోయారు. ఇజ్రాయెల్ మీద హమాస్ అనే ఉగ్రవాద సంస్థ శనివారం ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. హమాస్ అనేది పాలస్తీనాకు చెందిన గాజాలో అధికారం చెలాయిస్తున్న తిరుగుబాటు సంస్థ.

ఈ దాడి అంనతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. యుద్ధం వాళ్లు ప్రారంభించారని, దానికి వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు. హమాస్ దాడి వెలుగులోకి వచ్చిన అనంతరమే.. టెలివిజన్ ప్రసంగంలో నెతన్యాహు మాట్లాడారు. “మనం యుద్ధంలో ఉన్నాము. ఇది ఆపరేషన్, యుద్ధం. ఈ ఉదయం హమాస్ సంస్థ ఇజ్రాయెల్ మీద, దాని పౌరులపై ఘోరమైన ఆకస్మిక దాడిని ప్రారంభించింది. నేను భద్రతా సంస్థల అధిపతులతో మాట్లాడాను. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను ముందుగా ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చాను. వాళ్లు దీనికి తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. కచ్చితంగా దీనిపై వాళ్లకు తిరిగి ఇచ్చేయాల్సింది ఇచ్చేస్తాం” అని అన్నారు.

ఇవి కూడా చదవండి: 

Israel Palestina Crisis: ఇజ్రాయెల్‭లో ఉన్న భారత పౌరులకు కీలక సూచన చేసిన కేంద్ర ప్రభుత్వం

Israel Palestina Crisis: అసలేంటీ ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ? ఎందుకు ఇజ్రాయెల్ మీద 5,000 రాకెట్లతో దాడి చేసింది? పూర్తి వివరాలు తెలుసుకోండి

ట్రెండింగ్ వార్తలు