#AntiIndia Superman : కశ్మీర్‌పై వివాదాస్పద కామిక్స్ మూవీ.. భారత్ వ్యతిరేకిగా సూపర్‌మ్యాన్!

అమెరికాలో సూపర్ మ్యాన్ కొత్త యానిమేటెడ్ కామిక్ మూవీ వచ్చింది. ఈ మూవీలో సూపర్ మ్యాన్‌ను భారత వ్యతిరేకిగా (#AntiIndiaSuperman) చూపించారు. ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Anti India Superman : సూపర్‌మ్యాన్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో.. ఇండియాలో సూపర్‌మ్యాన్ పేరు వినని ఫ్యామిలీ ఉండదనే చెప్పాలి. తాజాగా అమెరికాలో సూపర్ హీరో సూపర్‌మ్యాన్ (Superman) కొత్త యానిమేటెడ్ కామిక్ మూవీ వచ్చింది. ఇందులో సూపర్ మ్యాన్ ను భారత వ్యతిరేకిగా (#AntiIndiaSuperman) చూపించారు. ఇప్పుడు ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ యానిమేటెడ్ మూవీలో కశ్మీర్‌లోని భారత సైన్యానికి  సూపర్‌మ్యాన్‌ను వ్యతిరేకిగా చూపించడమే కాకుండా  కశ్మీర్‌ను ఆర్మ్స్ ఫ్రీ జోన్‌గా సూపర్ మ్యాన్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.


ముఖ్యంగా చిన్నపిల్లలకు సూపర్‌మ్యాన్ అంటే చాలా ఇష్టం.. అతడే వారి దృష్టిలో హీరో.. సూపర్‌మ్యాన్ మూవీలను ఎంతోఇష్టంగా చూస్తుంటారు. అలాంటి సూపర్ హీరోను భారత్ వ్యతిరేకిగా చూపించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. DC కామిక్స్ భారత్‌ను అవమానించిందంటూ #AntiIndiaSuperman అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వీడియో గేమ్ సిరీస్‌లోని కామిక్ బుక్స్ నుంచి అదే పేరుతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో చూపించిన ఓ సన్నివేశం భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది.
China’s Covid Cases : చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం..విమానాలు రద్దు,స్కూల్స్ బంద్


ఈ కొత్త యానిమేటెడ్ మూవీలో కశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా అభివర్ణించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో సూపర్‌మ్యాన్, వండర్ వుమన్ కశ్మీర్ వెళ్తారు. వివాదాస్పద కశ్మీర్‌లో భారత సైన్యం, ఆయుధాలు ఉండటానికి వీల్లేదంటూ ఆయుధాలు, స్థావరాలను నాశనం చేస్తారు. ఈ కొత్త యానిమేటెడ్ కామిక్ మూవీ మంగళవారం విడుదలైంది. ఈ మూవీ స్టోరీలో కశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా చూపించారు. శాంతి పేరిట సూపర్‌మ్యాన్ భారత సైన్యానికి సంబంధించిన అన్ని ఆయుధాలను ధ్వంసం చేస్తాడు. ఆర్మీకి సంబంధించిన మిలటరీ హార్డ్ వేర్ ను కూడా ధ్వంసం చేస్తాడు. ఈ మూవీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సూపర్ మ్యాన్‌ను నిర్మించిన DC కామిక్స్ వెంటనే ఆ సీన్ తొలగించాలని, భారత్‌కు క్షమాపణ చెప్పాలంటూ #AntiIndiaSuperman హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్ అంటే.. మనదేశాన్ని రక్షించే నిజమైన సూపర్ హీరోలు.. మన భారత సైనికులే.. వారినే మన సూపర్‌మ్యాన్ గా భావిస్తాం.. గౌరవిస్తాం. సియాచిన్‌లో ఉన్న భారత సైనికులు. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ చలిలో దేశాన్ని రక్షిస్తారు.

సియాచిన్ వాతావరణంలో భూమితో పోలిస్తే కేవలం 10 శాతం ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. సియాచిన్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమిగా పేరొంది. సూపర్ యూనిమేటెడ్ మూవీలో కశ్మీర్ వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే తొలగించాలంటూ సోషల్ మీడియాలో భారతీయ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Salmonella Outbreak: అమెరికన్లను వణికిస్తున్నకొత్త వ్యాధి.. ఇంట్లో ఉల్లిపాయలను విసిరిపారేస్తున్నారు!

ట్రెండింగ్ వార్తలు