Anand Deverakonda Gam Gam Ganesha Trailer out now
Gam Gam Ganesha : విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల బేబీ మూవీతో భారీ హిట్ అందుకున్న ఆనంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి లు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. మే 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Deepika Padukone : బేబి బంప్‌తో ఓటేయడానికి వచ్చిన దీపికా పదుకోన్
ట్రైలర్‌లో ఓ దొంగగా, ఓ లవర్ బాయ్‌గా ఆనంద్ కనిపించాడు. ట్రైలర్‌ను చూస్తుంటే ఇది ఓ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.