Chhattisgarh : ఘోర ప్ర‌మాదం.. అదుపు త‌ప్పి లోయ‌లో ప‌డిన పిక‌ప్ ట్ర‌క్కు.. 18 మంది దుర్మ‌ర‌ణం.. మృతుల్లో 14 మంది మ‌హిళ‌లు

ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Chhattisgarh pickup vehicle overturns in Kawardha several dead

ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. పిక‌ప్ వాహ‌నం ఓ లోయలో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 18 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో 14 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుక్‌దూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

బైగా గిరిజన తెగ‌కు చెందిన 25 నుంచి 30 మంది అడ‌వి నుంచి టెండు ఆకుల తెంపుకుని తిరిగి వ‌స్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న పికప్ వాహ‌నం బహపానీ ప్రాంతం సమీపంలో ఓ మ‌లుపు వ‌ద్ద అదుపు త‌ప్పి సుమారు 20 అడుగుల లోయ‌లో ప‌డిపోయింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. కొంద‌రు ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌రణించ‌గా మ‌రికొంద‌రు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కుయ్ నివాసితులు అని చెప్పారు.

బైగా కమ్యూనిటీ బీడీ తయారీ చేస్తుంటారు. ఇందుకోసం వీరు వారు టెండు ఆకులను సేకరింస్తుంటారు. ఈ ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు.


ఉపముఖ్య‌మంత్రి దిగ్భ్రాంతి..

ఈ ప్ర‌మాదం పై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు