ACB Caught ENC: వామ్మో.. 50 లక్షలు లంచం.. ఏపీలో ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం..
దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ట్రాప్ చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ACB Caught ENC: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్ సీ శ్రీనివాస్ 25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం ఈఎన్ సీ శ్రీనివాస్ మొదట 25 లక్షలు లంచం తీసుకున్నారు. అది సరిపోక మరో పాతిక లక్షలు ఇవ్వాలని స్కూల్ నిర్వాహాకులను డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ట్రాప్ చేసి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈఎన్ సీ శ్రీనివాస్ గతంలోనూ పలు అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ లో ఈఎప్ సీ గా పని చేస్తున్నారు. ఇటీవలే పర్మినెంట్ ఈఎన్ సీగా ఆయనకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఇంతవరకు ఇంఛార్జ్ గా ఉన్నారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేశారు. గతంలోనూ శ్రీనివాస్ పై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఈఎన్ సీగా ఉన్న సుబ్బవరపు శ్రీనివాస్ 35 కోట్ల 50 లక్షలకు సంబంధించిన బిల్లు క్లియరెన్స్ కోసం 5 కోట్లు లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో బిల్లు చెల్లించకుండా వేధిస్తున్నారు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఉద్యోగానికి చివరి రోజులు కావడంతో అందినకాడికి దండుకోవాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నంలోనే 50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. తొలుత 25లక్షలు
లంచం తీసుకున్నారు. మరో 25లక్షలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
లంచం డబ్బు ఇచ్చేందుకు కాంట్రాక్టర్.. శ్రీనివాస్ ఆఫీస్ కే వచ్చారు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఏసీబీ అధికారులు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ పై నిధుల దుర్వినియోగం కేసు ఉంది. ఏసీబీ రెయిడ్స్ లో అరెస్ట్ అయిన చరిత్ర ఉంది. తనను పదవిలో కొనసాగించేందుకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు శ్రీనివాస్. దానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉంది.
అయితే, శ్రీనివాస్ ను పదవిలో కొనసాగించవద్దని, చాలా వేధింపులకు గురి చేస్తున్నాడని డిపార్ట్ మెంట్ కి చెందిన పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వాలని ఉద్యోగులను కూడా శ్రీనివాస్ వేధించే వారని తెలిసింది. ఈయన వేధింపుల భరించలేకపోయిన
శాఖకు సంబంధించిన ఉద్యోగులు.. రిటైర్ అయిన తర్వాత శ్రీనివాస్ ను ఆ పదవిలో కొనసాగించవద్దని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ కు రాజకీయ పలుకుబడి కూడా ఉంది.
Also Read: 50ఏళ్లకే పెన్షన్, ఉచిత విద్యుత్, అదనంగా రూ.25వేలు.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్