Mediciti Medicos Case: 100మంది.. మూడేళ్లుగా అదే పని.. మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం

51 మందిని నియమించుకొని దందా చేస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేసింది.

Mediciti Medicos Case: 100మంది.. మూడేళ్లుగా అదే పని.. మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం

Updated On : August 8, 2025 / 4:39 PM IST

Mediciti Medicos Case: హైదరాబాద్ మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. మెడికోలు మూడేళ్ల నుంచి గంజాయి వాడుతున్నట్లు తేలింది. 100 మంది మెడికోలు గంజాయి వాడినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఏడాది కాలం నుంచి 32 మంది మెడికోలు గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. గంజాయి కోసం క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వచ్చి తీసుకుంటున్నారు మెడికోలు.

సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు ఈగల్ టీమ్ తేల్చింది. జూనియర్లకు గంజాయి అలవాటు చేయడమే కాకుండా వారి ద్వారా సీనియర్లు తెప్పించుకుంటున్నారు.

మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ ను అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి మెడికోలకు గంజాయి అమ్ముతున్నాడు అరాఫత్. బీదర్ కు చెందిన జరీనా భాను నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు అరాఫత్. బీదర్ కు చెందిన జరీనాని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది.
ఏడాది కాలంలో గంజాయి అమ్మి కోటిన్నర రూపాయలు సంపాదించింది జరీనా.

హైదరాబాద్ లో జరీనాకు 51 మంది సభ్యుల గల ముఠా ఉన్నట్లు గుర్తించారు. 51 మంది డ్రగ్ పెడ్లర్లను నియమించుకొని గంజాయి దందా చేస్తోంది జరీనా. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేసింది.

Also Read: సొంత పార్టీపై అప్పర్ హ్యాండ్‌ సాధించేందుకు కవిత స్కెచ్? దీనిపై లీగల్‌ ఫైట్‌కు కవిత ప్లాన్..!