రాత్రివేళ ప్రియుడితో సన్నిహితంగా వివాహిత.. వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గ్రామస్తులు.. చెట్టుకు కట్టేసి.. గుండు గీయించి.. చెప్పలు దండలు వేసి..

బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్‌పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంగా మారింది.

రాత్రివేళ ప్రియుడితో సన్నిహితంగా వివాహిత.. వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గ్రామస్తులు.. చెట్టుకు కట్టేసి.. గుండు గీయించి.. చెప్పలు దండలు వేసి..

Bihar

Updated On : August 7, 2025 / 1:05 PM IST

Bihar: బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్‌పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటను విద్యుత్ స్తంభానికి తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సలేహ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన షకీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పని నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నాడు. షకీల్‌కు కూడా వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు. అయితే, మంగళవారం రాత్రి మహిళ ఇంట్లో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు గ్రామస్తులు గమనించి ఇంట్లోకి వెళ్లి వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని తీసుకొచ్చి విద్యుత్ స్తంభానికి తాడుతో కట్టేశారు.

పంచాయతీ పెద్దల నిర్ణయంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరికి గుండు కొట్టించి, ముఖంపై మసిపూసి, మెడలో బూట్లు, చెప్పలు దండ వేసి గ్రామం అంతా ఊరేగించారు. ఆ సమయంలో షకీల్ భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని గ్రామస్తుల చెరనుంచి ఇద్దరిని విడిపించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇద్దరిని తీవ్రంగా గాయపర్చిన గ్రామ పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.