కవితకు మళ్లీ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన కోర్టు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై వాదనలు జరిగాయి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో జూన్ 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్‌లోనే ఉండనున్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత సహా ఇతర నిందితులపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై వాదనలు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఏప్రిల్ 11న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఆమె ఉన్నారు.

బెయిల్ కోసం ఆమె పలుసార్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ కు ఆమె స్టార్ క్యాంపైనర్ గా ఉండడంతో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కోరినపప్పటికీ కవితకు బెయిల్ దక్కలేదు.

కేసులో కవిత ముఖ్య పాత్ర పోషించారని కవిత బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించింది. కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసని తెలిపింది. ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని ఇప్పటికే కోర్టుకు సీబీఐ తెలిపింది.

KTR: వీరి ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీపైనే బాధ్యత ఎక్కువ ఉంటుంది: కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు