RCB vs CSK : బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్.. ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో..!
సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 20, 2024 / 04:12 PM IST
RCB vs CSK match Mystery Girl danced video viral
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి దశకు చేరింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయాన్ని సాధించింది. సీఎస్కే పై గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. దీంతో బెంగళూరు ఆటగాళ్లతో పాటు ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్ మ్యాచుల్లో ఆట మాత్రమే కాదు కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్టార్లుగా మారిన ఘటనలు చూశాం. తాజాగా ఓ అమ్మాయి పై ప్రస్తుతం అందరి దృష్టి పడింది. చెన్నై ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు పూర్తి అయిన తరువాత 15వ ఓవర్ ప్రారంభానికి ముందు కెమెరామెన్ గ్యాలరీలపై ఫోకస్ చేశాడు.
RCB : గెలుపు సంబరాల్లో బెంగళూరు ఆటగాళ్లు.. ధోనికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వలేదా?
అక్కడ ఓ అమ్మాయి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆమె అందం, క్యూట్ స్టెప్పులు చాలా మందికి నచ్చేసింది. ఇంకేముంది ఆమె డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ మిస్టర్ గర్ల్ ఎవరా అంటూ వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో కెప్టెన్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 47), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 41) లు రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే ఆటగాళ్లలో రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61) హాఫ్ సెంచరీ బాదగా రవీంద్ర జడేజా (22 బంతుల్లో 42నాటౌట్ ) లు ఫర్వాలేదనిపించాడు.
Abhishek Sharma : కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ.. మంచిరోజులు నడుస్తున్నాయట
