RCB : గెలుపు సంబ‌రాల్లో బెంగ‌ళూరు ఆట‌గాళ్లు.. ధోనికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

RCB : గెలుపు సంబ‌రాల్లో బెంగ‌ళూరు ఆట‌గాళ్లు.. ధోనికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదా?

RCB Celebration Led To MS Dhoni Handshake Fiasco

Royal Challengers Bengaluru : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. 27 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో సీఎస్‌కే క‌నీసం 18 ప‌రుగులు చేసినా స‌రే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌గా ఆర్‌సీబీ బౌల‌ర్ య‌శ్ ద‌యాళ్ ఏడు ప‌రుగులే ఇచ్చి దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని వికెట్ తీశాడు. బెంగ‌ళూరు ప్లేఆఫ్స్ చేర‌డంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు సంబ‌రాల్లో మునిగిపోయారు.

అయితే.. మ్యాచ్ ముగిసిన త‌రువాత ఎంస్ ధోని మైదానంలోకి వ‌చ్చి ఆర్‌సీబీ ఆట‌గాళ్లతో క‌ర‌చాల‌నం చేసేందుకు వేచి ఉన్నాడు. ఎంత‌కూ వారు రాక‌పోవ‌డంతో అక్క‌డ ఉన్న కొంద‌రికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ త‌రువాత కాసేప‌టికి ధోని వ‌ద్ద‌కు విరాట్ కోహ్లి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మార‌గా.. ఆర్‌సీబీ వేడుల‌క‌పై నెటింట విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Abhishek Sharma : కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన అభిషేక్ శ‌ర్మ‌.. మంచిరోజులు న‌డుస్తున్నాయ‌ట‌

దీనిపై క్రిక్‌బజ్‌లో జరిగిన చర్చలో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే స్పందించారు. ‘మ్యాచ్ జ‌రిగిన త‌రువాత ఏం జ‌రిగిందో చూశాను. ఆర్‌సీబీ ఆట‌గాళ్లు ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ చేతులు ఊపుతూ సంతోషించారు. వారు ఐపీఎల్ క‌ప్పును ఇంకా గెల‌వ‌లేదు. ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంతో ఎంతో సంతోషించారు. ప్ర‌త్యర్థి ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసే స‌మ‌యం కూడా వారి వ‌ద్ద లేన‌ట్లుగా ఉంది.’ అని వాన్ అన్నాడు.

ఇక ఎంఎస్ ధోనికి ఇదే చివ‌రి మ్యాచ్ అయ్యేదేమో? ఎవ‌రి తెలుసున‌ని చెప్పాడు. అక్క‌డ స్టార్ ఆట‌గాడు వేచి ఉన్నాడని, ఓ సారి అత‌డిని క‌లిసి క‌ర‌చాల‌నం చేశాక సంబురాలు చేసుకుంటే బాగుండేది వాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆర్‌సీబీ ఆట‌గాళ్లు అత‌డి వీడ్కోలు కోరుకోక‌పోయినా గానీ.. మ్యాచ్ అయిపోయిన త‌రువాత గౌర‌వార్థం క‌ర‌చాల‌నం చేసి ఉంటే ఎంతో మ‌ర్యాద‌గా ఉండేదన్నాడు.

MS Dhoni : ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్.. సీఎస్కేకు వీడ్కోలు ఎప్పుడంటే?

ఏదీ ఏమైన‌ప్ప‌టికీ కూడా..

వాస్త‌వానికి అక్క‌డ ఏం జ‌రిగిందో తాను చూడ‌లేద‌ని ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే చెప్పుకొచ్చాడు. ఒక వేళ మీరు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ గెలిస్తే ముందుగా మీ భావోద్వేగాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో త‌ప్పేం లేదు. అయితే..ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేయాలి. ఆట యొక్క గొప్ప‌ద‌నాన్ని తెలిపేందుకు ఇదొక మార్గం. మ్యాచ్‌లో మ‌నం పోరాడాం. ఇప్పుడు మ‌నం విరోధులం కాదు అని షేక్‌హ్యాండ్‌కు అర్థ‌మ‌ని హ‌ర్షా తెలిపాడు. ఒక్క‌సారి ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసిన త‌రువాత ఎంత సేపు అయిన సంబ‌రాలు చేసుకోవ‌చ్చున‌ని చెప్పాడు.