Strange laws in Israel: విడాకులు తీసుకున్న వ్యక్తిని 8000 ఏళ్ల పాటు దేశంలోనే నిర్బంధించిన “ఇజ్రాయెల్” దేశం

పెళ్లి చేసుకుని, భార్య నుంచి విడాకులు పొందిన ఒక విదేశీయుడు, 8000 ఏళ్ల పాటు దేశం వదిలి వెళ్లకుండా ఆ దేశ న్యాయస్థానం శిక్ష విధించిన ఘటన ఇజ్రాయెల్ దేశంలో చోటుచేసుకుంది

Strange Laws in Israel: ఇదో వింత ఘటన. పెళ్లి చేసుకుని, భార్య నుంచి విడాకులు పొందిన ఒక విదేశీయుడు, 8000 ఏళ్ల పాటు దేశం వదిలి వెళ్లకుండా ఆ దేశ న్యాయస్థానం శిక్ష విధించిన ఘటన ఇజ్రాయెల్ దేశంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ దేశ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో, అంతే వింతగా ఉన్నాయని చెప్పే ఘటన ఇది!. వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియాకు చెందిన 44 ఏళ్ల నోయం హూపర్ట్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ కు చెందిన ఒక మహిళను గతంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం 2012లో సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా సొంత దేశం ఇజ్రాయెల్ కు చేరుకుంది. భార్యతో పాటు నివసించేందుకు హూపర్ట్ కూడా 2012లోనే ఇజ్రాయెల్ చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న కొన్ని రోజులకే హూపర్ట్ తన భార్య నుంచి విడాకులు కోరాడు. దీంతో 2013లో అక్కడి కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసి…నోయం హూపర్ట్ మాత్రం డిసెంబర్ 31, 9999 సంవత్సరం వరకు దేశం విడిచి పోకూడదంటూ ఆంక్షలు విధించింది. కనీసం సెలవు, పని నిమిత్తం కూడా దేశం విడిచి వెళ్లరాదంటూ కోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో 2013 నుంచి నోయం హూపర్ట్ ఇజ్రాయెల్ దేశంలోనే చిక్కుకున్నాడు.

Also Read: Bank Holiday Alert!: జనవరి నెలలో మొత్తం 16 బ్యాంకు సెలవులు: ఎప్పుడెప్పుడంటే

ఒక వేళ హూపర్ట్ ఇజ్రాయెల్ ధాటి బయటకు వెళ్లాలంటే, తన ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు దాటే వరకు ప్రతి నెలా 5000 ఇజ్రాయెల్ షెకెల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈమొత్తాన్ని లెక్కిస్తే దాదాపు 3.34 మిలియన్ల అమెరికన్ డాలర్లకు సమానం. వృత్తి పరంగా కెమికల్ అనలిస్ట్ అయిన నోయం హూపర్ట్, ఆమొత్తాన్ని చెలించలేక 2013 నుంచి ఇజ్రాయెల్ దేశంలోనే చిక్కుకున్నాడు. ఇలా విదేశీ మహిళను పెళ్ళాడి, ఆయా దేశాల చట్టాలపై అవగాహనలేక, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు ఆస్ట్రేలియా దేశస్తులు. ఇలా వింత రాక్షస చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బ్రిటిష్ జర్నలిస్ట్ “మరియాన్నే అజిజి” అనే మహిళ ఇటీవల నోయం హూపర్ట్ గురించి తెలుసుకుని ఆస్ట్రేలియా మీడియాకు తెలుపడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. అజిజి భర్త కూడా గతంలో ఇజ్రాయెల్ దేశంలో చిక్కకున్నాడు.

Also Read: Love : ఇద్దరు పిల్లల తండ్రి.. పోలీస్‌తో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో

ఇవే కాదు ఇజ్రాయెల్ దేశంలోని చట్టాలు, మనుషుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ కొందరు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు బాల్యం నుంచి యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు, తన తండ్రి సంరక్షణ కొరకు కోర్టు వరకు వెళ్తారు. తండ్రి తమను విడిచి ఎక్కడికి వెళ్లకుండా(కనీసం వ్యక్తిగత పనిపై కూడా) కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంటారు. ఇక సంపాదన కలిగిన పురుషులు (ముఖ్యంగా తండ్రులు) తమ సంపాదనకు అతీతంగా నూటికి నూరుశాతం సంపాదనను/నెల జీతాన్ని తమ పిల్లలకు ఇవ్వాల్సిందే. ఒక్కోసారి ఆమొత్తం తండ్రి నెల జీతం కంటే ఎక్కువగాను ఉంటుంది. అంటే ఒక వ్యక్తి నెల జీతం 10000 అయితే, పిల్లలు అంతకు మించి అడిగితే తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది. ఆలా లేని పక్షంలో దాదాపు 21 రోజుల పాటు ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి వింతైన చట్టాలున్నా ఇజ్రాయెల్ దేశం రావాలంటే ముందుగానే చట్టాలపై పూర్తి అవగాహనా తెచ్చుకోవాలంటూ కొందరు సలహాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు