Drunk Groom : ఫుల్‌గా తాగేసి లేటుగా కళ్యాణ మండపానికి వరుడు.. పెళ్లి వద్దన్న వధువు.. రూ. 4 లక్షలు డిమాండ్!

మొత్తం డబ్బులు చెల్లించేవరకు వదిలేది లేదంటూ పెళ్లికొడుకు తల్లిదండ్రులను కళ్యాణ మండపం దగ్గరే బందీలుగా చేసింది వధువు కుటుంబం.

Drunk Groom : కాసేపట్లో పెళ్లి.. అప్పటికే వరుడు పీకలదాకా ఫుల్‌గా తాగేశాడు. ముహూర్తం సమయానికి రావాల్సిందిపోయి తాగిన మైకంలో లేటుగా వచ్చాడు. అంతే.. పెళ్లిపీటలపై కూర్చొన్న వధువు.. నాకు ఈ పెళ్లి వద్దొంటూ తెగేసి చెప్పేసింది. అంతేకాదు.. పెళ్లి ఖర్చుల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా వరుడి కుటుంబాన్ని రూ. 4 లక్షలు డిమాండ్ చేసింది. మొత్తం డబ్బులు చెల్లించేవరకు వదిలేది లేదంటూ పెళ్లికొడుకు తల్లిదండ్రులను కళ్యాణ మండపం దగ్గరే బందీలుగా చేసింది వధువు కుటుంబం. ఈ విచిత్రమైన సంఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లా కుర్సేలా గ్రామంలో జరిగింది.

Read Also : Viral Video : చిన్ననాటి జ్ఞాపకాలు.. 90లో ఈ బర్త్‌డే పార్టీ ప్లేట్ గుర్తుందా? మీరూ ఇలానే సెలబ్రేషన్స్ చేసుకున్నారా?

వివరాల్లోకి వెళ్తే.. మంజిత్ చౌదరి అనే వ్యక్తి భాగల్పూర్ జిల్లాలోని సుల్తంగంజ్ నివాసి. కుర్సేలలోని కళ్యాణ మండపంలో పెళ్లి ఊరేగింపుకు వధువు తరఫు కుటుంబ సభ్యులు రాత్రి వరకు అతడి వేచి ఉన్నారు. కానీ, ఎవరూ అక్కడికి రాలేదు. దాంతో కోపోద్రిక్తులైన వధువు మనీషా కుమారి కుటుంబ సభ్యులు మంజిత్ కోసం వెతకగా రోడ్డుపై కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఉదయం పెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చి చూడగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. తనకు కాబోయే భర్త పరిస్థితి చూసిన మనీషా పెళ్లికి నిరాకరించింది.

రూ. 4 లక్షలు డిమాండ్ చేసిన వధువు కుటుంబం :
కళ్యాణ మండపానికి వస్తుండగా మంజిత్ మద్యం తాగి సేవించాడని, ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోనని సూటిగా చెప్పేసింది. అక్కడితో ఆగలేదు.. పెళ్లి ఖర్చుల కోసం అయిన మొత్తం రూ.4 లక్షలను తన కుటుంబానికి ఇచ్చేవరకు వరుడి తల్లిదండ్రులను వదిలేది లేదని వధువు తెలిపింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు మంజిత్‌తో పాటు అతని తల్లిదండ్రులను బందీలుగా ఉంచింది. దీనికి ఆ ప్రాంతంలోని స్థానికులు కూడా అంగీకరించారు. అయితే, వరుడి తరపు బంధువులు వధువు కుటుంబానికి చెల్లించిన మొత్తాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాతే వారిని పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్లేందుకు వధువు కుటుంబం అనుమతించింది. ఈ విషయంలో పోలీసులకు కూడా వధువు ఫిర్యాదు చేయలేదు.

నాతో బలవంతంగా తాగించారు : వరుడి ఆవేదన :
మంజిత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పెళ్లివేదిక వద్దకు వస్తున్న సమయంలో నా స్నేహితులు కొందరు కారులోకి వచ్చి మద్యం సేవించమని బలవంతం చేశారు. వారు నాకు ఏమి తాగించారో సరిగా నాకు తెలియదు. కానీ, నాకు ఒక్కసారిగా మైకం కమ్మినట్టుగా అనిపించింది. అందుకే, పెళ్లిమండపానికి ఆలస్యంగా వచ్చాను. మనీషా నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది అప్పటికీ నేను మత్తులో ఉన్నాను” అని మంజిత్ చెప్పుకొచ్చాడు.

మంజిత్‌కు అస్వస్థత అన్నారు.. అంతా అబద్దం.. :
కానీ, మనీషా సోదరుడు మాత్రం మంజిత్ ఫుల్‌గా తాగేసి ఉన్నాడని, అతని కుటుంబం అబద్ధం చెబుతోందని, వాస్తవానికి అతను మద్యానికి బానిస అయ్యాడని ఆరోపించాడు. “మేము అతన్ని కారులో చూసినప్పుడు.. మంజిత్ కుటుంబ సభ్యులు అతడు అస్వస్థతకు గురయ్యాడని, డాక్టర్ దగ్గరకు వెళుతున్నారని చెప్పారు. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. మేం అతన్ని పట్టుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్లాం. ఈ సంఘటన మా కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగించింది. మద్యానికి బానిసైన వ్యక్తికి ఇచ్చి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయబోయాం’ అని వధువు సొదరుడు తెలిపాడు.

Read Also : Viral Video: క్షణాల వ్యవధిలో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన అమ్మాయి

ట్రెండింగ్ వార్తలు