Viral Video: క్షణాల వ్యవధిలో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన అమ్మాయి
వారు డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి వేడుకలతో అంబరాన్నంటే ఆనందంతో గడుపుతున్న ఆ ఇంట క్షణాల వ్యవధిలో తీవ్ర విషాదం నెలకొంది. అక్క పెళ్లికి ముందు జరుపుకున్న హల్దీ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ఓ 18 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఉత్తర ప్రదేశ్, మీరట్లో చోటుచేసుకుంది ఈ ఘటన. వారు డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుప్పకూలిన అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి పేరు రిష్మా అని తెలిసింది.
ఆమె పడిపోయిన సమయంలో ఛాతీపై చేతులు పెట్టింది. గుంటెపోటు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చోటుచేసుకుంటున్న ఇటువంటి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Meerut: Another young person collapses & dies while dancing 💉💉💉
The vxxed should avoid dancing.
Vxxine War Part 2pic.twitter.com/mUeiGFELS2
— Neo (Bill Gates ka Parivar) (@neorevolt) April 29, 2024