Geetu Roayal : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బిగ్‌బాస్ గీతూ.. రెండేళ్లు చికిత్స తీసుకోవాలి.. డబ్బులు కూడా లేవు..

తూ రాయల్ గత కొంతకాలం నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తాజాగా తెలిపింది.

Geetu Roayal : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బిగ్‌బాస్ గీతూ.. రెండేళ్లు చికిత్స తీసుకోవాలి.. డబ్బులు కూడా లేవు..

Geetu Roayal Suffered from a Rare Disease she shared a video about her Situation

Updated On : April 29, 2024 / 3:00 PM IST

Geetu Roayal : సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్, బిగ్ బాస్ రివ్యూలతో గుర్తింపు తెచ్చుకున్న గీతూ బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో పాల్గొని బాగా పాపులర్ అయింది. గీతూ రాయల్, గలాటా గీతూగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక యూట్యూబ్ వీడియోలు, పలు టీవీ షోలలో పాల్గొంటూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే గీతూ రాయల్ గత కొంతకాలం నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తాజాగా తెలిపింది. తన వ్యాధి గురించి, తన ప్రస్తుత పరిస్థితి గురించి గీతూ రాయల్ తన ఫ్రెండ్ ధనుష్ తో కలిసి ఓ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.

ఈ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడుతూ.. జనవరి నుంచి నేను హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. నాకు ఏదో అరుదైన వ్యాధి వచ్చిందట. నేను బ్యాంకాక్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసొచ్చాను. అప్పట్నుంచి వచ్చిందా లేక విజయవాడ వెళ్లి అమ్మవారి గుడికి వెల్దామనుకొని వెళ్ళలేదు. అలాగే తిరుచానూరు వెల్దామనుకొని వెళ్ళలేదు. దానివల్ల వచ్చిందో తెలీదు కానీ జనవరి నుంచి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. తలనొప్పి, వాంతులు, తిండి తినాలనిపించలేదు. ఆ టైంలో ఒక దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ట్రీట్మెంట్ చేశారు తగ్గింది కానీ మళ్ళీ వచ్చింది. నాలుగు నెలలు ఏదో ఒక హాస్పిటల్ లో చూపిస్తూనే ఉన్నాను తగ్గలేదు. దాంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.

Also Read : Thandel : వామ్మో.. నాగచైతన్య సినిమాని అన్ని కోట్లు పెట్టి కొన్న నెట్‌ఫ్లిక్స్.. చైతూ కెరీర్‌లోనే హైయెస్ట్..

ఇక లాభం లేదని డబ్బులు పోయినా పర్లేదని నాలుగు నెలల తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ కి వెళ్ళాను. వాళ్ళు అన్ని టెస్టులు చేసి మైకో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబరికల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. TB ఫ్యామిలీకి చెందిన వ్యాధి ఇది. రేర్ గా వస్తుందట. ఈ ఇన్ఫెక్షన్ కి ఒకటే యాంటిబయోటిక్ ఉందట. ఒక అయిదు వారాలు రోజూ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత మెడిసిన్స్ వాడాలి. రెండు సంవత్సరాలు ఈ మెడిసిన్ తీసుకోవాలి. రోజూ ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల కూర్చోలేను, పడుకోలేను, చాలా కష్టపడుతున్నాను. నేను సెలబ్రిటీ అయినంత మాత్రాన మా దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు డబ్బులకు కూడా చూసుకోవాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు. అయినా నేను త్వరగా కోలుకొని వస్తాను అని తెలిపింది.

గీతూ రాయల్ ఇలా తాను ఓ అరుదైన వ్యాధి వల్ల బాధపడుతున్నాను అని తెలిపి, డబ్బులు లేవు అని చెప్పడంతో త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. అలాగే గీతూ రాయల్.. తన పిసినారితనం వల్ల మొదట్లో పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేదు. నాలుగు నెలలు వేస్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువైంది. ముందే హాస్పిటల్ కి వెళ్తే ఇప్పటికి తగ్గేదేమో. నాలాగా హెల్త్ విషయంలో పిసినారిగా ఉండకండి. ఏదైనా సమస్య వస్తే డబ్బులు పోయినా మంచి హాస్పిటల్ కి వెళ్ళండి అని తెలిపింది. ఇక గీతూ రాయల్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.