Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ్ కథకు హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునక్

బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన రామ్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను బ్రిటీష్ ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా రామ్ కథా కార్యక్రమానికి హాజరయ్యానని రిషి సునక్ చెప్పారు....

British PM Rishi Sunak

Rishi Sunak : బ్రిటీష్ ప్రధానమంత్రి రిషి సునక్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన రామ్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను బ్రిటీష్ ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా రామ్ కథా కార్యక్రమానికి హాజరయ్యానని రిషి సునక్ చెప్పారు. తాను హిందువునని, తన విశ్వాసం వ్యక్తిగతమని, మతం తన జీవితంలోని ప్రతీ అంశంలో మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. (British PM Rishi Sunak attends Ram Katha) ఆధ్యాత్మిక బోధకుడు మొరారీ బాపు రామ్ కథ కార్యక్రమంలో పాల్గొన్న యూకే ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి

‘‘ఈ రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మొరారీ బాపు రామ్ కథా కార్యక్రమానికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ప్రధానమంత్రిగా కాదు హిందువుగా’’ అని రిషి సునక్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. వేదికపై ఉన్న హనుమంతుని చిత్రపటాన్ని ప్రస్తావిస్తూ ‘‘బాపుకు బ్యాక్‌గ్రౌండ్‌లో బంగారు హనుమంతుడు ఉన్నట్లే, 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని నా డెస్క్‌పై బంగారు గణేశుడు ఉన్న ఫొటో పెట్టుకున్నందుకు నేను గర్విస్తున్నాను’’ అని రిషి సునాక్ చెప్పారు. రిషి సునక్ తన బాల్యంలో సౌత్ హాంప్టన్‌లోని తన తోబుట్టువులతో కలిసి దేవాలయాన్ని సందర్శించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

Sajjala Ramakrishna Reddy : వైసీపీ దూకుడు.. విజయవాడలో మూడు స్థానాలకు అభ్యర్థులు ఖరారు, ఎవరెవరంటే..

రాముడు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉంటారని భారత సంతతికి చెందిన మొదటి ప్రధానమంత్రి తన ముగింపులో పేర్కొన్నారు. బాపు చెప్పిన రామాయణంతోపాటు భగవద్గీత, హనుమాన్ చాలీసాను కూడా స్మరించుకుంటూ తాను వచ్చానని రిషి చెప్పారు. ‘‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి,నిస్వార్థంగా పని చేయడానికి నాకు శ్రీరాముడు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉంటారు’’ అని రిషి సునాక్ అన్నారు. రిషి సునక్ కూడా వేదికపై ఆర్తిలో పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని మొరారి బాపు రిషి సునక్ కు బహూకరించారు.

ట్రెండింగ్ వార్తలు