Siberian City: ఇదే అత్యంత చల్లటి నగరం.. చలి తట్టుకోవాలంటే క్యాబేజీలా డ్రెస్ చేసుకోవాలంటున్న స్థానికులు

యాకుస్క్‌లో చలికాలంలో సాధారణంగా మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఇప్పుడు మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Siberian City: ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరం ఏదో తెలుసా.. యాకుస్క్. రష్యా లోని మాస్కో నగరానికి ఉత్తరాన 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నగరం. ఇది సైబీరియా సిటీ. అంటే రష్యాలో అంతర్భాగమైన ఒక ప్రాంతం.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

యాకుస్క్‌లో చలికాలంలో సాధారణంగా మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఇప్పుడు మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ, అక్కడి ప్రజలు పెద్దగా కంగారు పడరు. ఎందుకంటే ప్రజలు ఈ ఉష్ణోగ్రతలకు అలవాటుపడి ఉంటారు. చలిని తట్టుకునేలా ప్రజలు లైఫ్‌స్టైల్ మార్చుకుంటారు. చలిని తట్టుకునేలా డ్రెస్ చేసుకుంటారు.

Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఒకేఒక్క పర్సన్ సుమ.. మూడేళ్లు మెసేజ్ లు చేసినా పట్టించుకోలేదు..

రెండు శాలువలు, రెండు గ్లోవ్స్ ధరిస్తారు. టోపీలు, హుడీలు ధరించి ఉంటున్నారు. ‘‘ఇక్కడి వాళ్లు చలి ఉన్నట్లు అనుకోరు. ఎందుకంటే చలిని తట్టుకునేలా ముందుగానే మెదడు సిద్ధమవుతుంది. అయినా, ఇక్కడ చలితో పోరాడటం కాదు.. చలికి అడ్టస్ట్ అవ్వడం నేర్చుకోవాలి” అని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ చేపలు, ఆహారాన్ని స్టోర్ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్రీజర్ లేదా ఫ్రిజ్ కూడా అవసరం లేదు.

సహజసిద్ధంగానే ఈ మంచులో ఆహారం పాడవకుండా ఉంటుంది. ఇక్కడ బతకాలంటే సరిగ్గా డ్రెస్ చేసుకుంటే చాలు.. అది కూడా అనేక పొరలుగా, క్యాబేజీలాగా డ్రెస్ చేసుకుంటే మరీ మంచిది అని స్థానికులు అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు