Eiffel Tower: 19 అడుగుల ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్

ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ 19.69 అడుగులు (6మీటర్లు) పొడవు పెరిగింది. మంగళవారం ఈ భారీ కట్టడంపైన కొత్త డిజిటల్ రేడియా యాంటీనా ఏర్పాటు చేయడంతో దీని ఎత్తు మరింత పెరిగినట్లు రికార్డులు...

Eiffel Tower: ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ 19.69 అడుగులు (6మీటర్లు) పొడవు పెరిగింది. మంగళవారం ఈ భారీ కట్టడంపైన కొత్త డిజిటల్ రేడియా యాంటీనా ఏర్పాటు చేయడంతో దీని ఎత్తు మరింత పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

19వ శతాబ్దంలో Gustave Eiffel నిర్మించిన ఈ కట్టడం 330 మీటర్ల పొడువు ఉండేది. అప్పటికే దానిపైన DAB+ (డిజిటల్ ఆడియో) యాంటీనా హెలికాప్టర్ సాయంతో ఏర్పాటు చేసి ఉంచారు. దీని నిర్మాణం కంటే ముందు వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎత్తుగా ఉండేది. దాని కంటే ఎత్తైన నిర్మాణం అయిన ఈఫిల్ టవర్ పొడవాటి మనిషి డిజైన్ లో రూపొందింది.

ప్రపంచంలోని టూరిస్ట్ ప్లేసుల్లో ఈఫిల్ టవర్ ఒకటి అని స్కూల్ పిల్లలు సైతం చెప్పగల రేంజ్ లో ఫ్యామస్ అయింది. ఇంకా దీనిని 100 ఏళ్ల కంటే ముందు నుంచే బ్రాడ్‌కాస్ట్ ట్రాన్స్‌మిషన్‌కు వినియోగిస్తున్నారు. యాంటీనాల కాలం చెల్లడంతో చాలా సార్లు వాటిని రీప్లేస్ చేశారు కూడా.

Read Also: తాజ్ మహల్‌ని ఉచితంగా చూడొచ్చు.. నిజమైన సమాధిని చూసే అవకాశం!

 

ట్రెండింగ్ వార్తలు