Twitter-X: ట్విటర్ నుంచి డైరెక్ట్ మెసేజ్ తీసెయ్యరట.. కాకపోతే ఆ సేఫ్టీ ఫీచర్ మాత్రం పోతుందట

ఈ సేఫ్టీ ఫీచర్‌ని తీసివేయడం వల్ల, వినియోగదారులు ఇతర ఖాతాలను బ్లాక్ చేయలేరు. అయితే బ్లాక్ అనే ఆప్షన్ కు బదులు.. మ్యూట్ అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఆప్షన్ ద్వారా తమకు నచ్చని ఖాతాలను మ్యూట్ లో పెట్టొచ్చు.

Twitter X: ఎక్స్(ట్విట్టర్) నుంచి డైరెక్ట్ మెసేజ్ అనే ఆప్షన్ తొలగిస్తున్నారంటూ వచ్చిన వార్తలకు ఆ సంస్థ బాస్ ఎలాన్ మస్క్ చెక్ పెట్టారు. డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ స్థానంలో ఆయన ఒక సేఫ్టీ ఫీచర్ కు మాత్రం చెక్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ లో ఉన్న బ్లాక్ అనే ఆప్షన్ ను తొలగించేందుకు పెద్ద నిర్ణయం తీసుకున్నారు.

Nitin Gadkari: అవినీతి నేతలు పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

ఈ విషయమై ఎక్స్ బాస్ మస్క్ ఒక పోస్ట్ చేశారు. అందులో వారు “ఎవరైనా బ్లాక్ చేయడానికి లేదా మ్యూట్ చేయడానికి ఏదైనా కారణం ఉందా? మీ కారణాలు చెప్పండి” దీనిపై ఎలోన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘డీఎం మినహా బ్లాక్‌ని ఫీచర్‌గా తొలగిస్తున్నాం’’ అని పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఈ సేఫ్టీ ఫీచర్‌ని తీసివేయడం వల్ల, వినియోగదారులు ఇతర ఖాతాలను బ్లాక్ చేయలేరు. అయితే బ్లాక్ అనే ఆప్షన్ కు బదులు.. మ్యూట్ అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఆప్షన్ ద్వారా తమకు నచ్చని ఖాతాలను మ్యూట్ లో పెట్టొచ్చు. దీంతో వారి పోస్టులు కనిపించవు.

ట్రెండింగ్ వార్తలు