Elon Musk vs Jellon Ski Twitter War: క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమంటూ ఎలన్ మస్క్ ట్వీట్.. మండిపడ్డ జెలన్ స్కీ.. ఇరువురి మధ్య ట్విటర్ వార్..

బిలియనీర్ ఎలోన్ మస్క్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య ట్విటర్‌లో వాదన జరిగింది. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించే ప్రణాళికపై మీ అభిప్రాయాన్ని తెలపాలని మస్క్ ట్విట్టర్‌లో నెటిజన్లను కోరారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ.. మస్క్ ట్వీట్ పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ట్విటర్ వార్ కొనసాగింది.

Elon Musk vs Jellon Ski Twitter War: బిలియనీర్ ఎలోన్ మస్క్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీ మధ్య ట్విటర్‌లో వాదన జరిగింది. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించే ప్రణాళికపై మీ అభిప్రాయాన్ని తెలపాలని మస్క్ ట్విట్టర్ నెటిజన్లను కోరారు. ట్విట్టర్ పోల్‌లో.. మస్క్ నాలుగు ఆక్రమిత ప్రాంతాలలో యూఎన్ పర్యవేక్షించే ఎన్నికలను ప్రతిపాదించాడు. మస్క్ ట్వీట్ పై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ మస్క్ ట్వీట్ పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ట్విటర్ వార్ కొనసాగింది.

మస్క్ తన ట్వీట్‌లో యుక్రెయిన్ – రష్యా శాంతి అంటూ.. యూఎన్ పర్యవేక్షణలో అనుబంధిత ప్రాంతాల్లో ఎన్నికలు జరపాలని, ప్రజలకు ఇష్టమైతే రష్యాలోకి వెళ్లిపోతుందని అన్నారు. క్రిమియా అధికారికంగా రష్యాలో భాగంమని, 1783 నుండి క్రిమియాకు నీటి సరఫరా హామీ ఇచ్చింది, ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుంది, ”అవును లేదా కాదు అని మస్క్ ట్విటర్‌లో రాశారు. ఇది చివరికి ఫలితం అయ్యే అవకాశముందని, అంతకు ముందు ఎంతమంది చనిపోతారు అంటూ ప్రశ్నిస్తూ మస్క్ ట్వీట్ చేశాడు.

మస్క్ ట్వీట్ ను ఉద్దేశిస్తూ.. జెలెన్ స్కీ తన సొంత పోల్‌తో స్పందించారు. “మీకు ఏ ఎలన్ మస్క్ అంటే ఎక్కువ ఇష్టం? ఉక్రెయిన్‌కు మద్దతిచ్చేవాడిగా, రష్యాకు మద్దతు ఇచ్చేవాడిగా” అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మస్క్.. నేను ఇప్పటికీ యుక్రెయిన్‌కు చాలా మద్దతు ఇస్తున్నాను. అయితే యుద్ధంతో యుక్రెయిన్‌తో పాటు బహుశా ప్రపంచానికి చాలా హాని కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

మస్క్, జెలన్ స్కీ మధ్య వాదనలు జరుగుతున్న క్రమంలో.. లిథువేనియా ప్రెసిడెంట్ గిటానాస్ నౌసెడా మస్క్‌కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. ‘డియర్ ఎలన్ మస్క్.. ఎవరైనా మీ టెస్లా చక్రాలను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు, అది వారిని.. కారు లేదా చక్రాల చట్టపరమైన యజమానిగా చేయదు అంటూ పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు