Cities floating on water : నీటిపై తేలియాడే నగరాలు!..యూరప్ దేశాల్లో ప్రయోగాలు, ఈ పరిస్థితులు దేనికి సంకేతాలు?!

నీటిపై తేలియాడే తామరాకుల్లాగా ఇక భవిష్యత్తులో నగరాలు నీటిపై తేలియాడనున్నాయా? యూరప్ దేశాల్లో ఇటువంటి ప్రయోగాలు చేయటం దేనికి సంకేతాలు?

construction of cities floating on water : నీటిలో తామరాకులు తేలుతుంటాయి. వాటిమీద నీటి బిందువు అటు ఇటు కదులుతుంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా..కానీ నీటిలో తామరాకులు తేలినట్లుగా ఇళ్లు తేలుతుంటే ఎలాఉంటుంది? భలే ఉంటుంది కదూ..భవిష్యత్తులో ఇక నగరాలు నీటిమీద తేలియాడబోతున్నాయా? అంటే నిజమేనంటున్నారు యూరప్ దేశాలవారు. భూమ్మీద జనాభా పెరుగుతుంటం..తగినంత స్థలం సరిపోదనే కారణంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇలా నీటిమీద నగరాలను నిర్మిస్తున్నారా? లేదా భూమిపై సముద్ర మట్టాల పెరుగుదల..మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా యూరప్ దేశాలు ఇటువంటి ప్లాన్ చేస్తున్నాయా? అనిపిస్తోంది.

అది ఆమ్‌స్టర్‌డ్యామ్ ఫ్లోటింగ్ పరిసరాల్లోని ఓ చిన్న సరస్సుపై పొందికగా నిర్మించిన మూడు అంతస్థుల భవనం. అక్కడి ప్రజలు, వర్షం ప్రమాదం ఉన్నాగానీ సన్నగా పడుతున్న వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంటి కిటికీ నుంచే చేపలు పట్టుకుని కమ్మటి కూర వండే ఓ ఇల్లాలు. నీళ్లలో ఆనందంగా గంతులేస్తున్న యువకులు. సరస్సు చుట్టూ బెంచీలు..సందడి సందడిగా ఉన్న వాతావరణ. బైకులమీద రివ్వున దూసుకొచ్చి అక్కడ ఉండే హోటల్స్ లో చక్కగా మాంసాహారం తింటూ ఆస్వాదిస్తున్న టూరిస్టులు. ఇలా అక్కడి వాతావరణం ఎంతో ఆనందంగా..హాయిగా ఉంది. ఎందుకంటే అక్కడ నీటిలో తేలియాడే మూడు అంతస్థుల భవనం అక్కడ ప్రత్యేకత.

Read more :Moon resort : చుక్కలను తాకే భవనాల మధ్యలో నేలపై ‘చందమామ’ రిసార్ట్‌.. 

ఇటువంటి అద్భతుమైన కట్టడానికి మూలం ‘టాన్ వాన్ నెమెన్’ అనే వ్యక్తి. మాంటెఫ్లోర్ కంపెనీ అధినేత ఆయన. సెమీ-అక్వాటిక్ కమ్యూనిటీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ఆయన కంపెనీయే. నీటిపై తేలియాడే 100 ఇళ్లను విజయవంతంగా నిర్మించారు టాన్ వాన్ నెమెన్. ఈ ప్రాజెక్టు విజయవంతం అయిన విషయం కంటే దీన్ని నిర్మించే పనిలో ఎదురైన పలు సమస్యల గురించే ఎక్కువగా చెబుతుంటారాయన. ఒకప్పుడు ఇబ్బంది పెట్టిన ఆ సమస్యలే ఇప్పుడు గొప్ప వినోదానికి కేంద్రంగా మారాయి. కొత్త ఆలోచనలు ఎప్పుడు కూడా ఇబ్బందుల్ని కలిగిస్తాయి. ఆతరువాత అవి సక్సెస్ అయ్యాక కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

తేలియాడే ఇళ్ల నిర్మాణాల కోసం నెదర్లాండ్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నెదర్లాండ్ తమ దేశ సృజనాత్మక నిర్మాణాల చరిత్రకు లోబడి ఈపరీక్షలు చేస్తోంది. నెదర్లాండ్ అంటే నీటిమీద నిర్మించే కట్టడాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అందుకే నెదర్లాండ్ దేశ సృజనాత్మక నిర్మాణాల చరిత్రకు లోబడి ఈపరీక్షలు చేస్తోంది.యూరప్‌లోని అతిచిన్న దేశమైన నెదర్లాండ్స్‌కు సముద్ర మట్టాలు పెరగే ప్రమాదంలో ఉంది. అందుకే నీళ్లపై తేలియాడే ఇళ్ల నిర్మాణాలపై ప్రయోగాలపైఈ దేశం ఆసక్తి చూపిస్తోంది. నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు దక్షిణాన 55 కి.మీ దూరంలో మికే వాన్ వింగర్డెన్, తన పాడి ఆవుల మందను ఒక వంతెన పైనుంచి నడిపిస్తూ వాటి కోసం అత్యాధునికంగా రూపొందించిన పశుశాలకు తరలిస్తున్నారు. రోటర్‌డ్యామ్ డాక్‌ జలాల్లో ఆగి ఉన్న రవాణా నౌకల నుంచి ఆవులను దించడానికి ఈ వంతెనను ఉపయోగించారు.

Read more : Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు

2012లో శాండీ హరికేన్ సృష్టించిన విధ్వంసంతో న్యూయార్క్‌లో రవాణా వ్యవస్థ, ఆహార సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మాన్‌హట్టన్‌లోని సూపర్ మార్కెట్లన్నీ ఆహార నిల్వలు నిండుకున్నారు. దీంతో వాన్ వింగర్డెన్ దంపతులకు ‘నీళ్లపై తేలియాడే పొలం (Floating form‌)’నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. వారు న్యూయార్క్ నుంచి నెదర్లాండ్స్‌కు తిరిగొచ్చాక ..వాతావరణానికి అనుకూలంగా మెదులుకునే ఫ్లోటింగ్ ఫామ్‌ను నిర్మాణానికి రెడీ అయ్యారు.అలా 2019లో ప్రారంభమైంది ఈ తేలియాడే పొలం. ప్రపంచంలోనే మొదటిసారిగా నీటిలో తేలియాడే పొలాన్ని నిర్మించారు వాన్ దంపతులు. ఆ పొలంలో 40 ఆవులు ఉన్నాయి. ఇవి డాక్ సైడ్ గడ్డి మైదానాల్లో, తేలియాడే పరిసరాల్లో తిరుగుతంటాయి. ఈ పొలంలో ఆవుల ద్వారా పాలు, చీజ్, యోగర్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతానికి సమీపంలో ఉండేవారికి అమ్ముతుంటారు.ఈ ఉత్పత్తుల్ని బైక్‌లు, ఎలక్ట్రిక్ వ్యాన్‌ల ద్వారా చేరవేస్తున్నారు.

ఈ నీటిలో తేలియాడే పొలం గురించి వాన్ మాట్లాడుతు..ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి..అమ్మడానికి మా పొలం అనుకూలంగా ఉంటుందని..భవిష్యత్‌లో ఇలాంటి తేలియాడే పొలాలకు మంచి ఆదరణ ఉంటుందని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. అలా ఆమె కేవలం పాడి మాత్రమే కాకుండా తేలియాడే పొలంలో కూరగాయల పొలంతో పాటు కోళ్ల ఫారంలను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు.నెదర్లాండ్స్‌లో ఇలా నీటిపై నివసించే ప్రజలు..నీళ్లపై నిర్మించిన పొలం. దాంట్లో పాడి పంటలు చూస్తే భవిష్యత్‌లో ఇక ఇటువంటివే నిర్మితం అవుతాయని అనిపిస్తోంది.

Read more : India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం

ఐక్యరాజ్యసమితి మద్దతుతో..అమెరికాకు చెందిన ఓషియానిక్స్ అనే సంస్థ నీటిపై తేలియాడే ఇళ్లను నిర్మించే పనిలో పడింది.ఈ ప్రాజెక్టును పెద్దఎత్తున నిర్మించాలనుకుంటోంది. దీని గురించి ఓషియానిక్స్ సంస్థ సీఈవో మార్క్ కోలిన్స్ చెన్ మాట్లాడుతు..ప్రపంచంలోనే మొట్టమొదటి పర్మినెంట్ ఫ్లోటింగ్ కమ్యూనిటీని 75 హెక్టార్లలో 10,000 నివాసాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో నివసించే వారికి రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎన్నటికీ ఎత్తు తగ్గకుండా ఉండే పేద్ద గోడను నిర్మించుకోవడం.రెండు అధునాతన ఇంజనీరింగ్ పద్ధతుల వైపు ఆలోచించటం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటువంటి ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటున్నామని తెలిపారు.

ఫ్లోటింగ్ సిటీ అంటే ఏదో చిన్న చిన్న నగరాలను ఏర్పాటుచేయటం కాదు. పెద్ద జిల్లాల స్థాయిలో ఈ నిర్మాణాలు చేయాలని యోచిస్తోంది ఓషియానిక్స్. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఇండోనేషియాలోని జకార్తా, చైనాలోని షాంఘై వంటి నగరాల్లో ఈ ఫ్లోటింగ్ సిటీలను నిర్మించాలనుకుంటోంది.ఈ తేలియాడే నగరాలను రెండు హెక్టార్ల వెడల్పుతో త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. ప్రతీ నగరంలోనూ 300 మంది నివాసం ఉండేలా, మిగతా ప్రాంతంలో వ్యవసాయంతో పాటు వినోదాలకు సంబంధించిన క్లబ్‌లను ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తోంది ఓషియానిక్స్ సంస్థ.


ఈ తేలియాడే నగరాల గురించి వింటే అదేదో కథల్లోలాగా అనిపిస్తుంది. కానీ పెరుగుతున్న జనాభా..అలాగే పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు. మారుతున్న వాతావరణ పరిస్థితులు.వీటి ప్రభావం కచ్చితంగా ఈ నీటిపై తేలియాడే నగరాల నిర్మాణాలు అవసరం కలిగించనున్నాయి.ఈ తేలియాడే కమ్యూనిటీలు బొలీవియా, పెరూ సరిహద్దుల్లోని టిటికాకా సరస్సులో చూడవచ్చు. ఇక నీటిలో తేలియాడే తోటల విషయానికొస్తే తేలియాడే బంగ్లాదేశ్‌లో రుతుపవనాల సమయంలో వీటిని చూడొచ్చు. ఈ ఫ్లోటింగ్ నగరాలు అదృశ్యం కావడానికి కారణం పెద్ద పెద్ద నగరాల నిర్మాణాల చేపట్టడమే. ఇప్పుడు మళ్లీ తేలియాడే నగరాల నిర్మాణాన్నే రానున్న భవిష్యత్‌గా భావిస్తున్నాం. మార్చబోతున్నాం.

ప్రపంచంలోని చాలా నగరాల్లో నౌకాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయి. అక్కడ మీరు ఇలాంటి నగరాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఇటువంటి నిర్మాణాలపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న నీటి మట్టాలతో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇటువంటి నీటిపై తేలియాడే నగరాలతో పరిష్కారం దొరుకుతుందని పలువురు భావిస్తున్నారు.

కానీ అసలు విషయం ఏమిటంటే..ఇటువంటి టెక్నాలజీ రానుందని చెప్పుకునే మనం దీని గురించి ఆనందించాలో ఇటువంటి పరిస్థితులు రానున్నాయని బాధపడాలో తెలియకుండా ఉంది. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్లనే ఇలా నీటిపై తేలియాడే నగరాల అవసరం వస్తుంది. అటువంటి పరిస్థితిరాకుండా ఉండాలంటే..ఈ సమస్యకు ఇది పరిష్కారం సముద్ర మట్టాలు మరింత పైకి పెరగకుండా కట్టడి చేయడమే.

ట్రెండింగ్ వార్తలు