California : కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై సంతకం చేయవద్దంటూ అమెరికాలో నిరసనలు

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కుల వివక్ష వ్యతిరేక బిల్లును వీటో చేయాలని అమెరికాలో నిసనలు నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై గవర్నర్ సంతకం చేయవద్దని కోరుతు నిరసనలు చేపట్టారు.

anti caste discrimination bill In American

California : అమెరికాలోని కాలిఫోర్నియా (America)లో కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. కాలిఫోర్నియా (California) రాజధాని శాక్రమెంటో(Sacramento)లో ఉన్న గవర్నర్‌ గెవిన్‌ న్యూసమ్‌ (Governor Gavin Newsom)కార్యాలయం శనివారం (సెప్టెంబర్ 10,2023) శాంతియుతంగా ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన కుల వివక్ష వ్యతిరేక బిల్లును వీటో చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు వివక్షాపూరితమైనదని..భారతీయులను, హిందువులను లక్ష్యంగా ఈ బిల్లు ఉందంటూ వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఈ చట్టం ఇండో అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని, ఆ వర్గాలకు వేధింపులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించకుండా తిరస్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. గవర్నర్ ఈ బిల్లుపై సంతకం పెట్టవద్దని కోరుతు నిరసనలు చేశారు.

గత ఆగస్టులో అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ(legislation by the State Assembly)లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదంతో అమెరికాలో కుల వివక్ష వ్యతిరేకతపై చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గవర్నర గావిన్‌ న్యూసమ్‌ దీనిపై సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. దీంతో గవర్నర్ ఈ బిల్లుపై సంతకం చేయవద్దని డిమాండ్ చేస్తు ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి.

Turkish Court : ముగ్గురు అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష.. తుర్కియే కోర్టు సంచలన తీర్పు

భారతీయ అమెరికన్లపై వివక్ష చూపించొద్దు అంటూ పోస్టర్లు, బ్యానర్లు చూపిస్తు నిరసన వ్యక్తం చేశారు. వీరిలో ఎక్కువమంది కాలిఫోర్నియా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేసి చట్టం చేస్తే హిందూ సమాజంపై వివక్ష పెరుగుతుందని ఈ విషయాన్ని గుర్తించి గవర్నర్ సంతకం చేయవద్దని కోరారు.

ట్రెండింగ్ వార్తలు