Gym Trainer : 210కిలోల బరువు బ్యాలెన్స్ చేయలేక మెడ విరిగి చనిపోయిన జిమ్ ట్రైనర్

210కిలోల బరువు గల బార్బెల్ మెడ‌పై పడి ప్రాణాలు కోల్పోయారు జిమ్ ట్రైనర్. 33 ఏళ్లకే అతను ప్రాణాలు కోల్పోయాడు.

indonesia Gym Trainer life End

Gym Trainer life End : జిమ్ చేస్తు చనిపోయారు అనే వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరమే. ఈక్రమంలో ప్రాణాలు కోల్పోవటం భయాందోళనలు కలిగిస్తోంది. జిమ్ చేస్తు హార్ట్ ఎటాక్ కు గురై చనిపోయిన వార్తలు వింటున్నాం. జిమ్ చేసే విధానంలోను..అక్కడ బరువులు ఎత్తే విధానంలోను అవగాహన లేక ఇలా జరుగుతోందా?లేక మరేదైనా..? అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఫిట్ నెస్ ట్రైనరే (fitness trainer)బరువులు ఎత్తుతు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇండోనేషయాలో చోటుచేసుకుంది. ఫిట్ నెస్ ట్రైనర్ ఇలా బరువులు ఎత్తుతు ప్రాణాలు కోల్పోవటం పైగా భయానంగా 210కిలోల బరువులు ఎత్తి మెడ విరిగి చనిపోవటం గమనించాల్సిన విషయం.

USA : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు .. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

జులై 15న ఇండోనేషియా(indonesia )లోని బాలి(Bali)లో 33 ఏళ్ల జ‌స్టిన్ విక్కీ(Justyn Vicky).. 210కిలోల బరువు గల బార్బెల్ ( lift 210 kilograms weight)ఎత్తుతుండగా అదికాస్తా అత‌డి మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జిమ్ లో ఏకంగా 210 కిలోల బరువు ఎత్తిన క్రమంలో దాన్ని మోయలేక అతను పడిన ఇబ్బంది వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. బరువును కంట్రోల్ చేయలేక దాన్ని అతి కష్టంమీద దించి వెనక్కి పడిపోయారు.

స్క్వాట్‌ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బ‌రువున్న‌ బార్బెల్‌ను ఎత్తి త‌న భుజాల‌పై పెట్టుకున్నారు. కానీ అంత బరువును మోయలేకపోయారు. బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడటంతో బార్బెల్ అత‌డి మెడ‌పై ప‌డింది. దీంతో మెడ విరిగిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అత‌డి గుండె, కాలేయానికి సంబంధించిన న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌దని డాక్టర్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ చేసినా ఫలితం లేకపోయింది. కాసేప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు.

Tierra Young Allen : పబ్లిక్ ప్లేస్‌లో గట్టిగా అరిచిందని అరెస్ట్ .. రెండు నెలలుగా జైల్లోనే టిక్ టాక్ స్టార్

 

 

ట్రెండింగ్ వార్తలు