fist Toothbrush History:కీ.పూర్వం 3000 ఏళ్లకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం..ఫస్టుబ్రష్ దేంతో తయారు చేసారో తెలిస్తే షాక్

కీ.పూర్వం 3000 ఏళ్లకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం ఉందనే విషయం తెలుసా? ప్రపంచంలో మొదటి బ్రష్ దేంతో తయారు చేసారో తెలిస్తే షాక్ అయ్యే విషయాలు..

History of the Toothbrush  : ఇప్పుడంటే మనం దంతాలు టూత్ బ్రష్ తో తోముకుంటున్నాం. మన పెద్దలు వేప పుల్లలు,గానుక పుల్లలతో తోముకునేవారు. లేదా పిడకల బూడిద (కచ్చికలు) బొగ్గులతో తోముకునేవారు. ప్రస్తుతం బ్రష్ ల్లో ఎన్నో రకాలొచ్చాయి. కానీ క్రీస్తు పూర్వం 3,000 ఏళ్ల క్రితమే మొట్టమొదటిగా బ్రష్ తయారు చేశారనే విషయం తెలుసా? అంటే అవునా..అనిపిస్తుంది. మరి మొదటిసారిగా తయారు చేసిన బ్రష్ ను దేంతో తయారు చేశారో తెలిస్తే ‘ఛీ..యాక్..’అని కక్కుకుంటామేమో..

క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం ఉందట.కానీ ప్రస్తుతం వినియోగంలో ఉ​న్న బ్రష్‌ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశమేనట. అంటే చైనా అన్నింటిలోను ముందే ఉంటుందని మరోసారి తెలిసింది. 600 యేళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్‌లను పరిచయం చేసింది కూడా చైనేయే కావటం మరో విశేషం..

Read more :  Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్‌పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. ఏంటీ ఛీ..యాక్ అని అనుకుంటున్నారా? పంది అంటే మనిషికి స్వతహాగా ఉండే ఫీలింగ్ అది. కానీ పంది మాంసాన్ని తినేవారిని దృష్టిలో పెట్టుకుని అటువంటి ఫీలింగ్ ను మార్చుకోవాలి. హా..ఈ పురాతన బ్రస్ తయారీ విషయంలోకి వస్తే..ఈ టూత్ బ్రష్‌పై ఉండే బ్రస్సెల్స్‌ చాలా గట్టిగా ఉండేవి. ఈ బ్రస్సెల్స్ ని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేశారు. ఈ వెంట్రుకలను ఓ వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లాగా తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్‌లను యూరప్‌, ఇంగ్లాండ్‌ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి.

1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్‌ ఈడిస్‌ అనే ఖైదీ కనుగొనేంతవరకూ ఈ బ్రష్‌లనే వినియోగించేవారు. ఆ కాలంలో విలియమ్‌ కూడా పంది వెంట్రుకలతోనే టూత్‌ బ్రష్‌ను తయారు చేసేవాడట. కానీ తరువాత తరువాత మార్పులు వచ్చాయి. ఈడిస్ జైలు నుండి విడుదలయ్యాక ‘విజ్‌డమ్‌ టూత్ బ్రష్’ అనే కంపెనీని ప్రారంభించి..బ్రిటన్ లో బ్రష్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్‌లు తయారవుతున్నాయి.

Read more : 4500 Year Old Sun Temple : ఫారోల దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..

1950లో డుపాంట్‌ డె నెమోర్స్‌ అనే వ్యక్తి నైలన్‌ బ్రిస్టల్‌ టూత్‌ బ్రష్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. నవంబర్‌ 7, 1857లో హెచ్‌ఎన్‌ వడ్స్‌వర్త్‌ అనే వ్యక్తి టూత్‌ బ్రష్‌లపై పేటెంట్‌ పొందిన మొదటి అమెరికన్‌గా పేరొందాడు. ఆ తర్వాత 1885లో అమెరికాలో పెద్ద ఎత్తున టూత్‌ బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇదన్నమాట ఈనాడు మనం అందరం ఉపయోగించే బ్రష్ వెనుక కథాకమామీషు..మనందరం వాడుతున్న టుత్‌ బ్రష్‌ చరిత్ర..!

 

ట్రెండింగ్ వార్తలు