World Second Largest Hindu Temple : ప్రపంచంలోనే అతిపెద్ద రెండో హిందూ దేవాలయం.. ఎక్కడుందో తెలుసా? ప్రత్యేకతలు ఏమిటంటే ..

అక్షరధామ్ ఆలయం నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు (శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్ప యొక్క అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది.

Swaminarayan Akshardham Temple

New Jersey Akshardham Temple: హిందూ దేవాలయాలు అనగానే భారత్‌దేశం గుర్తుకొస్తుంది. దేశంలో పెద్ద‌పెద్ద, పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ, భాతదేశం వెలుపల ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మితవుతోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో స్వామినారాయణ్ అక్షరధామ్‌‌గా పలిచుకునే ఈ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది. దీనిని అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ దేవాలయం సందర్శకులకోసం అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తుందని బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ తెలిపింది.

 

ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో  (ఎత్తు: 42 అడుగులు, వెడల్పు: 87 అడుగులు, పొడవు: 133 అడుగులు) నిర్మాణం జరిగింది. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు సుమారు 12ఏళ్లు పట్టింది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12వేల మందికిపైగా ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో సుమారు 10వేల విగ్రహాలను వాడారు. పురాతన భారతీయ సంస్కృతిని గుర్తుకుతెస్తూ కళారూపాలను ఆలయంపై చెక్కబడ్డాయి. కంబోడియాలోని 12వ శతాబ్దం నాటి అంగ్‌కోర్ హట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఆ ఆలయం 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు యూనెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ ఉంది. దాని తరువాత బహుశా ఇదే అతిపెద్దదని హిందూ ఆలయంగా చెబుతున్నారు. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు.

 

న్యూజెర్సీలోని అక్షరధామ్ ఆలయం నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు (శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్ప యొక్క అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది. ఇది వెయ్యి సంవత్సరాలు ఉండేలా రూపొందించబడింది. సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడ్డాయి.

ఆలయం వద్ద బ్రహ్మ కుండ్ అని పిలవబడే సాంప్రదాయ భారతీయ మెట్లబావి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుండి నీటిని కలిగి ఉంది. ఇదిలాఉంటే ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది.

ట్రెండింగ్ వార్తలు