Pak Fuel Prices : పాక్ లో భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు..చక్కెర కన్నా తక్కువే

పాకిస్తాన్ లో ఆయిల్ ధరలను భారీగా పెంచింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ శుక్రవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ

Pak Fuel Prices పాకిస్తాన్ లో ఆయిల్ ధరలను భారీగా పెంచింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ శుక్రవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కరెన్సీలో.. లీటరు పెట్రోల్ పై రూ.8.03,డీజిల్ పై రూ.8.14,కిరోసిన్ పై రూ.6.27,లైట్ డీజిల్  పై రూ.5.72 పెంచినట్లు శుక్రవారం పాక్ ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

భారత రూపాయి విలువ.. 2.29 పాకిస్తాన్ రూపాయలతో సమానం. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటరు పెట్రోల్ ధర పాక్ కరెన్సీలో రూ.145.82కాగా, హై స్పీడ్ డీజిల్ ధర రూ.142.62గా ఉంది. లైట్ స్పీడ్ డీజిల్ లీటరు ధర రూ.114.07 కాగా,కిరోసిన్ లీటరు ధర రూ.116.53గా ఉంది. కాగా,పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోలియం ఉత్పత్తులు అన్నీ లీటరు 110 రూపాయలు దాటడం ఇదే మొదటిసారి.

మరోవైపు,పాక్ లో చక్కెర ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆయిల్ ధరల కంటే చక్కెర ధరే ఎక్కువగా ఉంది. కిలో పంచదార రూ. 150కి పైనే అమ్ముడవుతోంది. నగరాలను బట్టి కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి. నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. రేటు అమాంతం పైపైకి పోతూనే ఉంది. పాకిస్తాన్ షుగర్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ…హోల్‌సేల్ మార్కెట్ లో చక్కెర కిలో రూ. 140 చొప్పున, రిటైల్ మార్కెట్ లో కిలో రూ.145- 150మధ్య అమ్ముతున్నట్లు తెలిపారు. అయితే, అక్రమంగా లాభాలు పొందేందుకు డీలర్లే కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రేట్లు పెంచారని ఆరోపణలున్నాయి.

ALSO READ Viral video : ఛత్తీస్‌గఢ్ సీఎంకు కొరడా దెబ్బలు..దారుణంగా కొట్టిన వైనం

ట్రెండింగ్ వార్తలు