Queen Elizabeth II Dies : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఆమె వయసు 96ఏళ్లు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Queen Elizabeth II Dies : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఆమె వయసు 96ఏళ్లు. గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్కాట్ లాండ్ లోని బాల్మోరల్ కోటలో ఆమె మరణించారు. గత ఏడాది అక్టోబర్ లో రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చారు. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆమెని పర్యవేక్షించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వీన్ ఎలిజబెత్ తుదిశ్వాస విడిచారు.

రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో ముందుగానే కుటుంబ సభ్యులంతా స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకున్నారు. రాణి 76 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్‌లో దేశవ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించారు.

రాణి ఎలిజబెత్‌ను గతేడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధించాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉన్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. బుధవారం సీనియర్‌ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ డాక్టర్ల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు.

ఎలిజబెత్‌-2 ఇక లేరని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారని బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ ప్రకటించింది. బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్‌-2. బ్రిటన్‌ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు (1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు.

ఒకవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్‌ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్‌-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు (1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు.

* ఎలిజబెత్‌-2.. ఏప్రిల్‌ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్‌ స్ట్రీట్‌లో జన్మించారు.

* తల్లిదండ్రులు.. కింగ్‌ జార్జ్‌-6, క్వీన్‌ ఎలిజబెత్‌

* గ్రీస్‌ యువరాజు, నేవీ లెఫ్టినెంట్‌ ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ సంతానం.

* 1952, ఫిబ్రవరి 6న తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్‌ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్‌ 2న ఆమె వెస్ట్‌మిన్ స్టర్‌ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

* 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్‌ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు.

ట్రెండింగ్ వార్తలు