World Chocolate Day 23 : ప్రేమను పెంచుకోవాలంటే చాక్లెట్లు పంచుకోవాలి.. విశేషాలు ఇవే..

చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. పుట్టినరోజుతో పాటు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేటపుడు చాక్లెట్ ఇచ్చి తీయని వార్త చెబుతారు. రకరకాల ఫ్లేవర్స్‌లో ఉండే చాక్లెట్లు రుచి చూడటానికి చాక్లెట్ ప్రియులు ఎంతో ఇష్టపడతారు. జూలై 7 వరల్డ్ చాక్లెట్ డే.

World Chocolate Day 23

World Chocolate Day 23 : చాక్లెట్స్ అంటే చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఇష్టపడతారు. పుట్టినరోజు నాడు చాక్లెట్ల్స్ పంచుతారు.. ఆనందకరమైన విషయాలు పంచుకునేటపుడు చాక్లెట్స్‌తో నోరు తీపి చేసుకుంటారు. జూలై 7 ‘ప్రపంచ చాక్లెట్ దినోత్సవం’. అసలు దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

Zomato : ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్లకు చాక్లెట్లు పంచి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న జొమాటో డెలివరీ ఏజెంట్

ప్రతి సంవత్సరం జూలై 7 న ‘ప్రపంచ చాక్లెట్ దినోత్సవం’ జరుపుకుంటారు. ఈరోజు చాక్లెట్ ప్రియులంతా రకరకాల చాక్లెట్లు పంచుకోవడంలో.. రుచి చూడటంలో.. తయారు చేయడంలో బిజీ బిజీగా గడుపుతారు. అసలు చాక్లెట్లు ఇష్టపడని వారుంటారా? అనేక సందర్భాల్లో మన ప్రియమైన వారికి మంచి వార్తలు చెప్పడానికి కూడా చాక్లెట్ ఇచ్చి చెబుతాం. చాక్లెట్‌కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. రకరకాల ఫ్లేవర్లలో దొరికే చాక్లెట్లు అందరిని ఆకర్షిస్తాయి.

1550 లో యూరప్‌లో ‘ప్రపంచ చాక్లెట్ దినోత్సవం’ జరుపుకున్నారట. అప్పట్లో మెక్సికో, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే చాక్లెట్ అందుబాటులో ఉండేదట. అయితే ఈ వేడుకను యూరోపియన్ ఖండానికి తీసుకురావాలని కోరుకున్నారట అక్కడి వారు. 1519 లో హెర్నాన్ కోర్టెస్‌కు అజెక్ట్ చక్రవర్తి Xocolatl అనే చాక్లెట్‌తో తయారు చేసిన పానీయాన్ని తయారు చేసాడట. కోర్టెస్ దీనిని యూరప్‌కు తీసుకువచ్చాడు. చక్కెర, వెనీలా మరియు దాల్చిన చెక్కను జోడించి దీనిని తీయగా తయారు చేశాడట. 1800 లో ఘన అంటే గట్టిగా ఉండే చాక్లెట్లు జనం ఇష్టపడటం మొదలుపెట్టారు. అలా వచ్చిన చాక్లెట్లు ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టంగా మారిపోయాయి.

Worm in the chocolate bar : చాక్లెట్ లు తింటున్నారా? పురుగులు ఉంటున్నాయి జాగ్రత్త

చాక్లెట్ దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?  అంటే ఇష్టమైన చాక్లెట్ బార్, చాక్లెట్ డెజర్ట్ లేదా హాట్ చాక్లెట్ డ్రింక్‌లను టేస్ట్ చేయండి.. మీకు బాగా ప్రియమైన వారితో ఆస్వాదించండి. లేదంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో వంటగదిలోకి చేరిపోండి. చాక్లెట్ చిప్ కుకీలు లేదా బ్రౌనీ బైట్స్‌ని తయారు చేయండి. అందరు కలిసి రుచి చూస్తే కలిగే ఆనందమే వేరు. లేదంటే చాక్లెట్లు తింటూ ‘చాక్లెట్ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ’, ‘చాక్లెట్’, ‘ఫారెస్ట్ గంప్’ వంటి చాక్లెట్ రిలేటెడ్ సినిమాలను చూడండి. మీరు పని చేసే చోట చాక్లెట్లు పంచుకోండి. ఇలా చేయడం వల్ల కొలిగ్స్ మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొని మంచి అనుబంధాలు ఏర్పడతాయి. చాక్లెట్ ప్రియులందరికీ హ్యాపీ ‘వరల్డ్ చాక్లెట్ డే’.

ట్రెండింగ్ వార్తలు