Rishi Sunak: బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌దవి పోటీలో రెండో రౌండ్‌లోనూ అగ్ర‌స్థానంలో భార‌త సంత‌తి నేత రిషి

బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం, ప్రధాని అభ్యర్థిత్వానికి జ‌రుగుతోన్న పోటీలో మాజీ ఆర్థిక‌ మంత్రి, భార‌త సంత‌తి నేత రిషి సునక్ దూసుకుపోతున్నారు. కొద్ది సేప‌టి క్రితం రెండో రౌండ్ ఓటింగ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇందులోనూ రిషి సునక్ గెలుపొందారు. ఆయ‌న‌కు రెండో రౌండ్ ఓటింగ్‌లో 101 ఓట్లు ప‌డ‌గా, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్దౌంట్‌కు 83, విదేశాంగ శాఖ‌ కార్యదర్శి లిజ్ ట్ర‌స్‌కు 64 ఓట్లు వ‌చ్చాయి.

Rishi Sunak: బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం, ప్రధాని అభ్యర్థిత్వానికి జ‌రుగుతోన్న పోటీలో మాజీ ఆర్థిక‌ మంత్రి, భార‌త సంత‌తి నేత రిషి సునక్ దూసుకుపోతున్నారు. ఆయ‌న‌ ఎంపీల మొదటి రౌండ్ ఓటింగ్‌లో ఇప్ప‌టికే విజయం సాధించారు. కొద్ది సేప‌టి క్రితం రెండో రౌండ్ ఓటింగ్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇందులోనూ రిషి సునక్ గెలుపొందారు. ఆయ‌న‌కు రెండో రౌండ్ ఓటింగ్‌లో 101 ఓట్లు ప‌డ‌గా, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్దౌంట్‌కు 83, విదేశాంగ శాఖ‌ కార్యదర్శి లిజ్ ట్ర‌స్‌కు 64 ఓట్లు వ‌చ్చాయి. అట‌ర్నీ జ‌న‌ర‌ల్ సుయెల్లా బ్రవెర్మాన్‌కు కేవ‌లం 27 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. తక్కువ ఓట్లు వచ్చినవారు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో సుయెల్లా బ్రవెర్మాన్‌ పోటీ నుంచి వైదొలిగారు.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయ‌డంతో ఈ పోటీ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. రిషి సునక్ ఎంపీల మొదటి రౌండ్ ఓటింగ్‌లోనూ మొద‌టి స్థానంలో నిలిచారు. మొద‌టి రౌండ్‌లో ఆయ‌న‌కు 88, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్దంట్‌కు 67, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌కు 50 ఓట్లు వ‌చ్చాయి. కాగా, పోటీలో చివ‌రి వ‌ర‌కు నిలిచిన వారిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, ప్రధాన మంత్రిగా టోరీ సభ్యులు ఎన్నుకుంటారు. తుది ఫ‌లితాలు సెప్టెంబరు 5న వెల్ల‌డ‌వుతాయి.

ట్రెండింగ్ వార్తలు