Nigeria Road Accident: నైజీరియాలో ఢీకొన్న మూడు బస్సులు.. 37మంది మృతి

నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి వెలుపల మూడు బస్సులు ఢీకొనడంతో 37 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆ దేశ రోడ్డు భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..

Nigeria Road Accident: నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి వెలుపల మూడు బస్సులు ఢీకొనడంతో 37 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆ దేశ రోడ్డు భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు వాణిజ్య బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ సమయంలోనే మరోబస్సు వేగంగా వచ్చి వీటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో37 మంది ప్రయాణికులు మరణించినట్లు బోర్నో రాష్ట్ర రోడ్డు భద్రత ఏజెన్సీ అధిపతి ఉటానే బోయి తెలిపారు.

Pune Road Accident: పుణె-బెంగళూరు హైవేపై లారీ బీభత్సం.. 48వాహనాలు ధ్వంసం.. 30మందికి గాయాలు

ప్రమాదంలో అధికశాతం మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలోకి మారిపోయాయని బోయి అన్నారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 35 కి.మీ (20 మైళ్లు) దూరంలోని జకానా గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు టైరు పగిలి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Road Accident: వనపర్తి జిల్లాలో ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ సెక్టార్ కమాండర్ తెలిపారు. అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మృత దేహాలను సామూహికంగా ఖననం చేస్తారు. నైజీరియాలో తరచు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవర్‌లోడింగ్, భద్రతలేని రహదారి పరిస్థితులు, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు సభవిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు