Russia-Ukraine War : యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా..

రష్యా యుక్రెయిన్ పై పట్టుబిగిస్తోంది.దీంట్లో భాగంగా రష్యా బలగాలు యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లిర్ ప్లాంట్ అయిన జిప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్నాయి

Russia hands over Zaporizhzhia Nuclear Power at Ukraine : యుక్రెయిన్ పై అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యా యుద్ధంలో మరో కీలక అడుగువేసింది. ఒక్కొక్కటిగా ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా యుక్రెయిన్ పై మెల్లమెల్లగా పట్టుబిగిస్తోంది. దీంట్లో భాగంగా రష్యా బలగాలు యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతి పెద్ద న్యూక్లిర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది.

Also read : Nuclear Power Plants : యుక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. అణు విద్యుత్తు ప్లాంట్ల భద్రతపై ఆందోళన..!

తొమ్మిదో రోజు కూడా యుక్రెయిన్ పై తన ప్రతాపాన్ని చూపుతున్న రష్యా శుక్రవారం (మార్చి 4,2022) ఉదయం జిప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ ను చేజిక్కించుకుంది. రాకెట్లతో దాడి చేసి జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ లోని ఈ జప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్ యూరప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ కావటం విశేషం.

ఈక్రమంలో యుక్రెయిన్ పై రష్యా తన అశేష బలగాలతో అత్యాధునిక ఆయుధాలు విరుచుకుపడుతునే ఉంది. మరోపక్క యుక్రెయిన్ కూడా రష్యాపై ఎదురు దాడులు చేస్తునే ఉంది.రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా దాడుల్లో ఇప్పటికే అనేక జనావాసాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడితో మరో పెనుప్రమాదం ముంచుకోస్తోంది.

Also read : Russia-ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం అంతా నేను ప్లాన్ చేసినట్లే జరుగుతోంది..టార్గెట్స్ రీచ్ అయ్యాం : పుతిన్

ప్రపంచ దేశాలతో పాటు సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి కూడా యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలను సూచిస్తుంటే పుతిన్ మాత్రం తగ్గేదేలేదంటూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో అమెరికా రష్యాపై పలు ఆంక్షలు విధిస్తోంది. యుద్ధం ఆపేస్తే ఆంక్షలు ఎత్తివేస్తామంటూ ఆఫర్ ఇచ్చినా పుతిన్ మాత్రం ఏమాత్రం ఖాతరు చేయకుండా తన యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు