Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?

జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది.

Russia's Luna-25 Probe

Russia Luna25 probe: జాబిలి దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయింది. జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ (Roscosmos) ప్రకటించింది. లూనా-25తో సంబంధాలు ఇవాళ మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని, దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వివరించింది.

కొన్ని గంటల ముందు కూడా రష్యా పలు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే. లూనా-25 ల్యాండర్‌లో సమస్యలు తలెత్తాయని తెలిపింది. రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా పేర్కొంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తమ ప్రయోగం విఫలమైందని స్పష్టం చేసింది.

ఇక, భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన వేళ ఈ సారి ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఇస్రో అనేక మార్పులు చేసింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైన వేళ ఇక ఇస్రో చంద్రయాన్-3పైనే అందరి దృష్టి నెలకొంది.

ఇవాళ తెల్లవారుజామున చంద్రయాన్-3 మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా పూర్తిచేసింది. దీనిపై ఇస్రో ప్రకటన చేసింది. చంద్రుడికి చంద్రయాన్-3కి చేరువయింది. ఇక ల్యాండింగే ఆలస్యం. లూనా-25 ల్యాండర్‌లో సమస్యలు తలెత్తాయని తెలిపింది. రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా పేర్కొంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తమ ప్రయోగం విఫలమైందని స్పష్టం చేసింది.

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం.. చంద్రుడికి అత్యంత సమీపంలోకి విక్రమ్ ల్యాండర్.. ఎన్ని కిలో మీటర్ల దూరంలో ఉందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు