Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో నేటి భార‌త షెడ్యూల్.. మూడో రోజు ఆశ‌ల‌న్నీ వీరిపైనే..

పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజైన సోమ‌వారం భార‌త్ షెడ్యూల్ ఇలా ఉంది.

ramita jindal

పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజైన ఆదివారం భార‌త్ ప‌త‌కాల ఖాతా తెరిచింది. 10మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్‌లో మను భాకర్ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. దీంతో మూడు రోజు భార‌త్‌కు మ‌రిన్ని ప‌త‌కాలు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌లో రిథమ్ సాంగ్వాన్- అర్జున్ సింగ్ చీమాతో పాటు మను భాకర్- సరబ్జోత్ సింగ్ పోటీప‌డ‌నున్నారు. కాగా.. మూడో రోజైన సోమ‌వారం భార‌త్ షెడ్యూల్ ఇలా ఉంది.

ఆర్చ‌రీ..
* పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్: తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ – సాయంత్రం 6:30 గంట‌ల‌కు
* పురుషుల జట్టు సెమీ -ఫైనల్స్ : రాత్రి 7:40 (వారు అర్హత సాధిస్తే)
* పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్ : 8:18pm (వారు అర్హత సాధిస్తే)
* పురుషుల జట్టు స్వర్ణ పతక మ్యాచ్ : రాత్రి 8:41 (వారు అర్హత సాధిస్తే)

IRE vs ZIM : బాల్ ఆప‌క‌పోయినా బాగుండేది గ‌దా.. ఇప్పుడు చూడు.. కష్ట‌ప‌డి బౌండ‌రీ ఆపిన ఫీల్డ‌ర్‌ పై..

బ్యాడ్మింటన్..
* పురుషుల డబుల్స్ (గ్రూప్ దశ) : సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి & చిరాగ్ శెట్టి vs మార్క్ లామ్స్‌ఫస్&మార్విన్ సీడెల్ (జర్మనీ) – మధ్యాహ్నం 12గంట‌ల‌కు
*మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్) : అశ్విని పొన్నప్ప &తనీషా క్రాస్టో vs నమీ మత్సుయామా& చిహారు షిడా (జపాన్) – మధ్యాహ్నం 12:50 గంట‌ల‌కు
*పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్) : లక్ష్య సేన్ vs జూలియన్ కరాగ్గి (బెల్జియం) – సాయంత్రం 5:30 గంట‌ల‌కు

హాకీ..
* పురుషుల పూల్ బి మ్యాచ్ : భారత్ vs అర్జెంటీనా – సాయంత్రం 4:15గంట‌ల‌కు

ENG vs WI : ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?

షూటింగ్..
* 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత : మను భాకర్ &సరబ్జోత్ సింగ్; రిథమ్ సాంగ్వాన్ &అర్జున్ సింగ్ చీమా – 12:45 గంట‌ల‌కు
* పురుషుల ట్రాప్ అర్హత : పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 1గంట‌కు
* 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్ (పతక ఈవెంట్) : రమితా జిందాల్ – మధ్యాహ్నం 1గంట‌కు
* 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ (పతక ఈవెంట్) : అర్జున్ బాబుటా – మధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు

టేబుల్ టెన్నిస్
*మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 32) : శ్రీజ అకుల vs జియాన్ జెంగ్ (సింగపూర్) – రాత్రి 11:30గంట‌ల‌కు

ట్రెండింగ్ వార్తలు