T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్ ఎవ‌రితో ఆడ‌నుందంటే?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను (T20 World Cup 2026 ) ఐసీసీ విడుద‌ల చేసింది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్ ఎవ‌రితో ఆడ‌నుందంటే?

ICC T20 World Cup 2026 confirmed warm up schedule

Updated On : January 27, 2026 / 12:58 PM IST

T20 World Cup 2026 : ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం కానుంది. భార‌త్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఇప్ప‌టికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. కాగా.. ఈ టోర్నీ క‌న్నా ముందు అన్ని జ‌ట్లు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఈ వార్మ‌ప్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుద‌ల చేసింది.

వార్మ‌ప్ మ్యాచ్‌లు ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. వార్మ‌ప్ మ్యాచ్‌ల‌కు బెంగ‌ళూరులోని సీఓఈ, చెన్నైతో పాటు శ్రీలంక‌లోని కొలంబోలు ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. భార‌త -ఏ జ‌ట్టు రెండు వార్మ‌ప్ మ్యాచ్‌లు న‌మీబియా, యూఎస్ఏల‌తో ఆడ‌నుంది. ఇక సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఫిబ్ర‌వ‌రి 4న ద‌క్షిణాఫ్రికాతో ఏకైక‌ వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది.

MS Dhoni : ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ప్రాక్టీస్ మొద‌లెట్టిన మ‌హేంద్ర సింగ్ ధోని, కుర్రాళ్ల‌కు క్లాసులు షురూ..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 వార్మ‌ప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..

* ఫిబ్ర‌వ‌రి 2న – అఫ్గానిస్తాన్‌ vs స్కాట్లాండ్ (బెంగళూరు CoE)
* ఫిబ్ర‌వ‌రి 2న – అమెరికా vs ఇండియా A (నవీ ముంబై)
* ఫిబ్ర‌వ‌రి 2న – కెనడా vs ఇటలీ(చెన్నై)
* ఫిబ్ర‌వ‌రి 3న – ఒమన్ vs శ్రీలంక A(కొలంబో)
* ఫిబ్ర‌వ‌రి 3న – నెదర్లాండ్స్ vs జింబాబ్వే(కొలంబో)
* ఫిబ్ర‌వ‌రి 3న – నేపాల్ vs యుఏఈ (చెన్నై)

IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్.. అయ్య‌ర్‌కు మాత్రం..

* ఫిబ్ర‌వ‌రి 4న – స్కాట్లాండ్ vs నమీబియా ( బెంగళూరు CoE)
* ఫిబ్ర‌వ‌రి 4న – అఫ్గానిస్తాన్ vs వెస్టిండీస్ (బెంగళూరు CoE)
* ఫిబ్ర‌వ‌రి 4న పాకిస్తాన్ vs ఐర్లాండ్ (కొలంబో)
* ఫిబ్ర‌వరి 4న – భారత్ vs దక్షిణాఫ్రికా(నవీ ముంబై)
* ఫిబ్రవరి 5న – జింబాబ్వే vs ఒమన్(కొలంబో)
* ఫిబ్రవరి 5న – నేపాల్ vs కెనడా (చెన్నై)
* ఫిబ్రవరి 5న – ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్(కొలంబో)
* ఫిబ్రవరి 5న – న్యూజిలాండ్ vs అమెరికా(నవీ ముంబై)
* ఫిబ్రవరి 6న – ఇటలీ vs యుఏఈ – (చెన్నై)
* ఫిబ్రవరి 6న – నమీబియా vs ఇండియా A (బెంగళూరు CoE)