IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్.. అయ్య‌ర్‌కు మాత్రం..

వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు (IND vs NZ ) షాక్ త‌గిలింది.

IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు భారీ షాక్.. అయ్య‌ర్‌కు మాత్రం..

New Zealand Tour of India Shreyas Iyer to continue till the end of T20I series (pic credit@BCCI)

Updated On : January 27, 2026 / 10:22 AM IST

IND vs NZ : న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు షాక్ త‌గిలింది. శ‌స్త్ర‌చికిత్స కార‌ణంగా కివీస్‌తో తొలి మూడు టీ20ల‌కు దూర‌మైన మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ చివ‌రి రెండు టీ20ల‌కు అందుబాటులోకి వ‌స్తాడ‌ని అంతా భావించారు. అయితే.. అత‌డు పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో చివ‌రి రెండు మ్యాచ్‌ల‌కు సైతం దూరం అయ్యాడ‌ని బీసీసీఐ తెలిపింది.

అత‌డి స్థానంలో తొలి మూడు టీ20ల‌కు ఎంపిక చేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను చివ‌రి రెండు మ్యాచ్‌ల‌కు కూడా కొన‌సాగించాల‌ని సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యించిన‌ట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్న‌ట్లు చెప్పింది.

Prathyoosha Kumar : బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న ఆర్‌సీబీ ప్లేయ‌ర్ ప్ర‌త్యూష

అయితే.. ఇక్క‌డ ఆనందించ‌ద‌గ్గ విష‌యం ఏమిటంటే.. తిల‌క్ వ‌ర్మ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 బ‌రిలోకి దిగుతాడ‌ని బీసీసీఐ తెలిపింది. ఈ మెగా టోర్నీ ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ప్రారంభం కానుంది.

‘తిలక్ వర్మ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ప్ర‌స్తుతం అత‌డు బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉన్నాడు. అత‌డు పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను సాధించ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో కివీస్‌తో జ‌రుగుతున్న IDFC ఫస్ట్ బ్యాంక్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల‌కు అత‌డు అందుబాటులో ఉండడు. అత‌డి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కొనసాగాలని సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యించారు. తిల‌క్ ఫిట్‌నెస్‌ను సాధించిన త‌రువాత ఫిబ్ర‌వ‌రి 3న భార‌త టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు.’ అని బీసీసీఐ తెలిపింది.

Abhishek Sharma : ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా ఆ ఒక్క‌టి మాత్రం చాలా క‌ష్టం.. జీవితంలో చేస్తానో లేదో తెలియ‌దు..

నవీకరించిన భార‌త టీ20 జ‌ట్టు..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్‌), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్‌), ర‌వి బిష్ణోయ్‌.