IRE vs ZIM : బాల్ ఆప‌క‌పోయినా బాగుండేది గ‌దా.. ఇప్పుడు చూడు.. కష్ట‌ప‌డి బౌండ‌రీ ఆపిన ఫీల్డ‌ర్‌ పై..

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని అరుదైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి.

IRE vs ZIM : బాల్ ఆప‌క‌పోయినా బాగుండేది గ‌దా.. ఇప్పుడు చూడు.. కష్ట‌ప‌డి బౌండ‌రీ ఆపిన ఫీల్డ‌ర్‌ పై..

Fielder saves the boundary and Batters run 5 in ZIM vs IRE one off Test

Ireland vs Zimbabwe : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని అరుదైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా ఐర్లాండ్‌, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలాంటి ఓ ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది. బ్యాట‌ర్ కొట్టిన బంతి బౌండ‌రీకి వెలుతుండ‌గా క‌ష్ట‌ప‌డి ఫీల్డ‌ర్ ఫోర్ పోకుండా బంతిని ఆపాడు. ఇందుకు స‌ద‌రు ఫీల్డ‌ర్‌ను మెచ్చుకోవాలి గానీ.. పాపం అత‌డి వ‌ల్ల జ‌ట్టుకు న‌ష్టం జ‌రిగింది. బ్యాట‌ర్లు ఐదు ప‌రుగులు తీయ‌డంతో ఫీల్డ‌ర్ ప‌డిన క‌ష్టం వృథా అయింది.

158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ఐర్లాండ్ బ‌రిలోకి దిగింది. 5 వికెట్ల న‌ష్టానికి 74 ప‌రుగుల‌తో ఐర్లాండ్ ఇన్నింగ్స్ కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో జింబాబ్వే బౌల‌ర్ రిచ‌ర్డ్ న‌గ‌ర‌వ బౌలింగ్ వేశాడు. అత‌డి బౌలింగ్‌లో ఓ బంతిని ఆండీ మెక్‌బ్రైన్ క‌వ‌ర్స్ దిశ‌గా షాట్ ఆడాడు. ఫీల్డ‌ర్ టెండాయ్ చ‌టారా బాల్ ను చేజ్ చేసి మ‌రీ బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర బాల్‌ను వెన‌క్కి నెట్టాడు. బాల్ ను మైదానంలోకి నెట్టాడు గానీ.. అత‌డు బ్యాలెన్స్ కోల్పోవ‌డంతో బౌండ‌రీ హోర్డింగ్ పై నుంచి అవ‌త‌లికీ జంప్ చేశాడు.

IND vs SL : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవ‌సం.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏమ‌న్నాడంటే..?

మ‌ళ్లీ అత‌డు వ‌చ్చి బాల్‌ను వికెట్ కీప‌ర్‌కు అందించే లోగా ఐరిష్ బ్యాట‌ర్లు ఐదు ప‌రుగులు తీశారు. పాపం అత‌డు అంత క‌ష్ట‌ప‌డి బాల్‌ను ఆపిన ఫ‌లితం ద‌క్క‌క‌పోగా ఓ అద‌న‌పు ప‌రుగు ల‌భించింది. క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. బంతిని ఆపే బ‌దులు బౌండ‌రీ అవ‌త‌లి నెట్టినా బాగుండేది.. ఓ అద‌న‌పు ప‌రుగు వ‌చ్చేది కాద‌ని అంటున్నారు.

ENG vs WI : ఏంటి అన్న‌యా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్న‌వా..? అంత తొంద‌రేంది..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 210 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఐర్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 250 ప‌రుగులు చేసింది. దీంతో ఐర్లాండ్‌కు 40 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఆ త‌రువాత జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐర్లాండ్ ముందు 158 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. దీన్ని ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.