అణు రహస్యాలను దొంగిలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నాలు : అమెరికా, బ్రిటన్ హెచ్చరిక

ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అణు, సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యూకే, యూఎస్, దక్షిణకొరియా దేశాలు హెచ్చరించాయి.

North Korea

North Korea hackers : ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అణు, సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యూకే, యూఎస్, దక్షిణకొరియా దేశాలు హెచ్చరించాయి. ఆండారియల్, ఏపీటీ 45 అనే పేర్లతో పిలవబడే ఈ బృందం హ్యాకర్లు రక్షణ, ఏరోస్పేస్, న్యూక్లియర్, ఇంజనీరింగ్ సంస్థల్లో రహస్య సమాచారాన్ని పొందేందుకు లక్ష్యంగా పెట్టుకుందని వారు పేర్కొన్నారు. ప్యోంగ్యాంగ్ యొక్క నిషేధిత అణ్వాయుధ కార్యక్రమానికి మద్దతుగా సైనిక రహస్య సమాచారాన్ని దొంగిలించండానికి ప్రపంచ వ్యాప్తంగా గూఢచర్యను నిర్వహిస్తున్నాయని మూడు దేశాలు తమ నివేదికలో పేర్కొన్నాయి.

Also Read : Chiranjeevi : ఇండియాలోనే కాదు పారిస్‌లో కూడా మెగాస్టార్ రేంజ్.. ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్..

ముఖ్యంగా అమెరికా వైమానిక దళ స్థావరాలను, నాసా, రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. హ్యాకర్ల నుంచి మూడు దేశాలతోపాటు జపాన్, భారత్ దేశంలోని సంస్థలతోసహా ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు సైబర్ సాంకేతికత ముప్పు పొంచిఉందని ఏజెన్సీలు పేర్కొన్నాయి. డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) దాని సైనిక, అణు కార్యక్రమాలను చురుగ్గా పర్యవేక్షిస్తున్నట్లు చూపిస్తుందని బ్రిటన్ GCHQ గూఢచారి సంస్థలో భాగమైన ఎన్సీఎస్సీకి చెందిన పాల్ చిచెస్టర్ అన్నారు. ఇదిలాఉంటే అంతర్జాతీయంగా ఒంటరిగా ఉన్న ఉత్తర కొరియా గతంలోనూ సున్నితమైన సైనిక సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లను ఆశ్రయించిందన్న విమర్శలను ఎదుర్కొంది.

 

ట్రెండింగ్ వార్తలు