ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌‌లో ముగ్గురు విద్యార్థుల మృతి ఘటన.. బయటికొచ్చిన మరో వీడియో

మరికొందరు విద్యార్థులు సాయం చేశారు. విద్యార్థులు తొందరగా పైకి రావాలని ఓ యువకుడు..

సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీసిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బేస్‌మెంట్లోకి నీరు ప్రవేశించిన వేళ నీటిలో నుంచి కొందరు విద్యార్థులు మెట్ల మీదుగా పైకి వచ్చారు.

వారికి మరికొందరు విద్యార్థులు సాయం చేశారు. విద్యార్థులు తొందరగా పైకి రావాలని ఓ యువకుడు అరుస్తున్నట్లు వినపడుతోంది. లోపల ఇంకెవరైనా ఉన్నారా అని అతడు అడిగాడు. నీటి నుంచి కొందరు విద్యార్థులు త్వరగా బయటకు రావడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. అందులోనే ఉండిపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

చట్ట విరుద్ధంగా సెల్లార్‌లో విద్యార్థులతో చదివించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోపై రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల మృతి ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు ఎంసీడీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అధికారులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు.

యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళనతో రాజేంద్ర నగర్ లో సెల్లార్లలో ఉన్న 13 లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లను ఎంసీడీ అధికారులు సీజ్ చేశారు. రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినెటర్ దేశ్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అభిషేక్ గుప్త దేశ్ పాల్ సింగ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Also Read : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత సూర్య‌నారాయ‌ణ బాబు కన్నుమూత

ట్రెండింగ్ వార్తలు