Uppalapati Suryanarayana Babu : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత సూర్య‌నారాయ‌ణ బాబు కన్నుమూత

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

Uppalapati Suryanarayana Babu : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత సూర్య‌నారాయ‌ణ బాబు కన్నుమూత

Uppalapati Suryanarayana Babu

Updated On : July 29, 2024 / 7:39 AM IST

Producer Uppalapati Suryanarayana Babu : టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత ఉప్ప‌ల పాటి సూర్య‌నారాయ‌ణ బాబు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. గ‌త కొన్ని రోజులు సూర్య‌నారాయ‌ణ బాబు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

పద్మావతి ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 24కు పైగా సినిమాల‌ను నిర్మించారు. ‘బజార్ రౌడీ’, ‘అల్లుడు దిద్దిన కాపురం’, ‘అన్నదమ్ముల సవాల్’, ‘శంఖారావం’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’, ‘సంధ్య’, ‘బెజవాడ రౌడీ’ వంటి సినిమాలు నిర్మాత‌గా ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చాయి.

సినిమాలు చేస్తున్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీతులసీని సూర్య‌నారాయ‌ణ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత 1985లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుపై పోటీ చేసి ఓడిపోయారు.

Mr Bachchan: రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల.. అదిరిపోయిందంతే..