Moon Influence Earth Climate : భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న చంద్రుడు

అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని తీసుకురాగలిగామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ మట్టిలోని రసాయన సమ్మేళనాలు, ఐసోటోప్ లకు భూమిపై లభించే వాటికి సారూప్యతలు ఉన్నాయని తేల్చారు.

moon influence earth climate

Natural Satellite Of Earth : ఎన్నో అంతుబట్టని విషయాలకు నెలవు అంతరిక్షం. ఆ విషయాల్లో చంద్రుడు కూడా ఒకటని చెప్పవచ్చు. అనుకున్నట్లుగా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చంద్రుడి పుట్టుక, ఉపరితలంపై ఏముంది? అన్న విషయాలపై మరింత సమాచారం వెలువడనుంది. ఒక సిద్ధాంతం ప్రకారం సౌర కుటుంబం ఏర్పడిన (6 నుంచి 17.5 కోట్ల సంవత్సరాలకు) తొలినాళ్లలో భారీ పరిమాణంలోని ఓ అంతరిక్ష శకలం భూమిని ఢీకొనగా, ఏర్పడ్డ శకలాలు భూమి నుంచి విడిపోయిన ఓ భాగమే చంద్రుడిగా ఏర్పడింది.

ఈ థియరీ చాలా మంది శాస్త్రవేత్తల ఆమోదం పొందింది. ఇదికాక మరో మూడు థియరీలు ఉన్నాయని బ్రిటన్ పరిశోధకురాలు సారా రస్సెల్స్ అంటున్నారు. వీటిలో మొదటిది ఓ ఆస్టరాయిడ్ భూ ఆకర్షణలో చిక్కుకుపోయి కొంతకాలానికి భూ కక్ష్యలో చేరింది. రెండోది భూమి, చంద్రుడు ఒకేసారి ఆవిర్భవించాయి. మూడోది భూపరిభ్రమణం వల్ల ఓ ముక్క వేరుపడి చంద్రుడిగా ఏర్పడిందని ఆమె వెల్లడించారు.

Moon Moving Away From Earth : భూమికి దూరమవుతున్న చంద్రుడు.. 60 వేల కి.మీ దూరం జరిగిపోయిన మూన్

అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని తీసుకురాగలిగామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ మట్టిలోని రసాయన సమ్మేళనాలు, ఐసోటోప్ లకు భూమిపై లభించే వాటికి సారూప్యతలు ఉన్నాయని తేల్చారు. భూమిపై స్థిరమైన వాతావరణం ఏర్పడటానికి చంద్రుడు దోహదపడుతున్నాడని ఓ థియరీ ఉంది. భూవాతావరణాన్ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడని, చంద్రుడిని సహజ సిద్ధమైన శాటిలైట్ గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు