California Shooting: కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారితోసహా ఆరుగురు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు.

California Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఆర్నెళ్ల చిన్నారితోసహా 17ఏళ్ల తల్లికూడా ఉన్నారు. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొనేలోపు నిందితులు పరారయ్యారు. కాల్పుల అనంతరం కొందరు ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో స్థానికులు స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించారు. అనంతరం ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి

ఈ విషయంపై తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన షెరీఫ్ మైక్ బౌడ్రెక్స్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ముఠా ఈ ఘటనకు పాల్పడినట్లు చెప్పాడు. ఆర్నెళ్ల చిన్నారితో పాటు ఆ చిన్నారి తల్లి తలపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపాడు. ఇది యాదృచిక హింసాత్మక చర్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులు జరిపారని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగి ఉంటాయని అన్నారు.]

Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

ఇదిలాఉంటే వారం రోజుల క్రితం ఆ నివాసంలో నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. మాదక ద్రవ్యాలు నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు జరిపిన వారంరోజుల అనంతరం ఆ ఇంటిపై గుర్తుతెలియని ముఠా సభ్యులు దాడి చేశారు. కాల్పుల సమయంలో మరో ఇద్దరు వారికంటపడకుండా జాగ్రత్త పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులుగా అనుమానిస్తున్నారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు