South African : దక్షిణాఫ్రికాలో గ్యాస్ లీక్‌, 16 మంది మృతి

దక్షిణాఫ్రికా దేశంలో గ్యాస్ లీక్ అయి 16 మంది మరణించారు. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది....

South African Slum Gas Leak

South African : దక్షిణాఫ్రికా దేశంలో గ్యాస్ లీక్ అయి 16 మంది మరణించారు. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. (South African Slum Gas Leak)అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్న జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్‌మెంట్‌లో గ్యాస్ లీక్ సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో సంఘటన స్థలంలోనే 16 మంది మరణించారని, మరికొందరిని పారామెడిక్స్ సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడమని అత్యవసర సేవల ప్రతినిధి విలియం నట్లాడి చెప్పారు.

Mexico Bus Accident : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం, 27 మంది మృతి

ఆసుపత్రిలో ఉన్నవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.మరో 11 మంది పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్యాస్ పేలుడు గురించి కాల్ వచ్చింది. అయితే అక్కడికి చేరుకోగానే విషపూరిత వాయువు ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయిందని గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్‌ను అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు