నన్ను కూడా చంపాలనుకున్నారు: ట్రంప్‌పై కాల్పుల వేళ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు

Tesla CEO Elon Musk: ‘గత ఎనిమిది నెలల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు నన్ను చంపడానికి ప్రయత్నించారు’ అని అన్నారు.

Elon Musk

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు కలకలం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గత ఎనిమిది నెలల్లో తనపై కూడా రెండు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు.

టెక్సాస్‌లోని టెస్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో తనను చంపడానికి తుపాకులతో వచ్చిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. దయచేసి భద్రతను పెంచుకోవాలంటూ ఎలాన్ మస్క్‌కు ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు. ‘చంపేందుకు ట్రంప్ వరకూ వచ్చిన వారు మీ వరకూ రాగలరు’ అని పేర్కొన్నారు. దీనికే ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు.

“మున్ముందు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. గత ఎనిమిది నెలల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. టెక్సాస్‌లోని టెస్లా హెడ్ క్వార్టర్స్‌కి సమీపంలో వారిద్దరిని అరెస్టు చేశారు” అని మస్క్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ త్వరగా కోలుకోవాలని మస్క్ మరో ట్వీట్ చేశారు. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని పలు దేశాల అధినేతలు ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రకటనలు చేశారు.

Also Read : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!

ట్రెండింగ్ వార్తలు