SpaceX Satellites Crash : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!

SpaceX Satellites Crash : తప్పుడు కక్ష్యలోని 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం వల్ల కక్ష్యలోని ఇతర ఉపగ్రహాలకు లేదా ప్రజల భద్రతకు ముప్పు ఉండదని స్పేస్ఎక్స్ హామీ ఇచ్చింది.

SpaceX Satellites Crash : స్పేస్ఎక్స్‌కు తీరని ఎదురుదెబ్బ.. భూమిపై కూలిపోనున్న 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు!

20 Satellites To Crash On Earth As SpaceX Rocket Leaves ( Image Source : Google )

SpaceX Satellites Crash : ప్రపంచ టెక్ బిలియనీర్, ఎలన్ మస్క్ సొంత అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు కక్ష్యలో ప్రవేశపెట్టిన స్టార్ లింక్‌కు చెందిన 20 ఉపగ్రహాలు త్వరలో భూమిపై కుప్పకూలిపోనున్నాయి. స్పేస్ఎక్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఫ్లాకాన్ 9 రాకెట్ నుంచి పేల్చిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు తిరిగి భూమికి క్రాష్ అవుతాయని స్పేస్ఎక్స్ వెల్లడించింది.

కక్ష్యలో ప్రవేశపెట్టే క్రమంలో రెండో దశలో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయిందని కంపెనీ తెలిపింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. “ఫాల్కన్ 9 రెండవ దశ మొదటి దహనాన్ని నామమాత్రంగా ప్రదర్శించింది. అయితే, రెండవ దశలో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయింది. పెరిజీని లేదా కక్ష్య అత్యల్ప బిందువును పెంచడానికి ఎగువ దశ ఇంజిన్ మెర్లిన్ వాక్యూమ్ ఇంజిన్ అసాధారణతను ఎదుర్కొంది. దాంతో రెండవ దహనాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోయింది.

స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను గుర్తించడానికి అంతరిక్ష బృందం చేసిన ప్రయత్నం గురించి వివరాలను షేర్ చేసింది. స్పేస్‌ఎక్స్ ఇప్పటివరకు 5 ఉపగ్రహాలను గుర్తించింది. వాటి అయాన్ థ్రస్టర్‌లను ఉపయోగించి కక్ష్యను పెంచడానికి ప్రయత్నిస్తోంది. మరో పోస్టులో స్పేస్ఎక్స్ బృందం 10 ఉపగ్రహాలతో టచ్‌లో ఉందని స్పేస్‌ఎక్స్ తెలిపింది.

ఇప్పటికే ఆ 10 ఉపగ్రహాలను బృందం చేరుకుందని వాటి అయాన్ థ్రస్టర్‌లను ఉపయోగించి కక్ష్యను పెంచడానికి ప్రయత్నించింది. అయితే, దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి కేవలం 135 కిలోమీటర్ల ఎత్తులోని వాతావరణంలో పేలిన శాటిలైట్లు ఉన్నాయని తెలిపింది. ఉపగ్రహ వైఫల్యానికి గల కారణాలను సంస్థ వివరణ ఇచ్చింది.

పెరిజీ గుండా వెళ్లే ప్రతి మార్గం.. ఉపగ్రహ కక్ష్యలోని ఎత్తైన ప్రదేశం నుంచి 5కి.మీ ఎత్తును తొలగిస్తుంది. ఈ స్థాయి డ్రాగ్‌లో ఉపగ్రహాలను పెంచడానికి థ్రస్టర్ సరిపోదు. భూమి వాతావరణంలోకి ఉపగ్రహాలు తిరిగి ప్రవేశించడం వల్ల కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలకు లేదా ప్రజల భద్రతకు ముప్పు ఉండదని స్పేస్ఎక్స్ హామీ ఇచ్చింది.

స్పేస్‌ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ కూడా తన కంపెనీ ఎక్స్‌లో షేర్ చేసిన వరుస పోస్ట్‌లపై స్పందించారు. “అయాన్ థ్రస్టర్‌లను వాటి సమానమైన వార్ప్ 9లో ప్రయోగించడానికి శాటిలైట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నాం. స్టార్ ట్రెక్ ఎపిసోడ్ మాదిరిగా పనిచేయదు. కానీ, శాటిలైట్ థ్రస్టర్‌లు కక్ష్యను వాతావరణం లాగడం కన్నా వేగంగా పైకి లేపాలి లేదంటే అవి కాలిపోతాయి’’ అని టెక్ బిలియనీర్ పేర్కొన్నారు.

Read Also : Elon Musk : న్యూరాలింక్ మరో సరికొత్త ప్రయోగం.. పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యలను పరిష్కరించే డివైజ్..!