China ‘Yuan Wang 5’ : చైనాకు చెక్ పెట్టిన శ్రీలంక..నిఘానౌక ‘యువాన్‌ వాంగ్ 5’ నిలిపే యత్నం..

హిందూమహాసముద్రంలో మోహరించి..భారత క్షిపణుల పరిశోధనలపై నిఘా ఉంచాలనుకున్న చైనాకు శ్రీలంక తాత్కాలికంగా చెక్ పెట్టింది. ఆపత్కాలంలో అన్నీతానై ఆదుకుంటున్న భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు తమ జలాలు ఉపయోగించుకోనివ్వబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. చైనా నిఘానౌక యువాన్‌ వాంగ్ 5ను హంబన్‌టోట పోర్టుకు పంపే ప్రక్రియను కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని చైనాకు లేఖ రాసింది.

China ‘Yuan Wang 5’ : హిందూమహాసముద్రంలో మోహరించి..భారత క్షిపణుల పరిశోధనలపై నిఘా ఉంచాలనుకున్న చైనాకు శ్రీలంక తాత్కాలికంగా చెక్ పెట్టింది. ఆపత్కాలంలో అన్నీతానై ఆదుకుంటున్న భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు తమ జలాలు ఉపయోగించుకోనివ్వబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. చైనా నిఘానౌక యువాన్‌ వాంగ్ 5ను హంబన్‌టోట పోర్టుకు పంపే ప్రక్రియను కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని కోరింది.

శ్రీలంక కనీవినీ ఎరుగని సంక్షోభంతో అల్లాడుతోంది. ఆ దేశం దివాళా తీయడానికి కారణమైన చైనా ఈ సమయంలోనూ తన వక్రబుద్ధి వదులుకోలేదు. శ్రీలంక కష్టాలను ఆసరాగా చేసుకుని..భారత్‌ను ఇరుకునపెట్టేందుకు వ్యూహరచన చేసింది. మన క్షిపణులపై నిఘా పెట్టి..సమాచారం సేకరించగల ఒక ఓడను శ్రీలంక జలాల్లో ప్రవేశపెట్టాలని అనుకుంది. శ్రీలంకలో తన ఆధీనంలో ఉన్న హంబన్‌టోట పోర్టులో నిఘా నౌకను ఉంచడం ద్వారా….భారత క్షిపణి ప్రయోగాల ఆనుపానులు అంచనావేయాలన్నది డ్రాగన్ దుర్మార్గం. చైనా ఎత్తుగడ తెలుసుకున్న భారత్ శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. దీంతో చైనాకు చెక్ చెప్పింది లంక. కొంతకాలం పాటు నిఘానౌక పర్యటనను వాయిదావేసుకోవాలని కోరింది.

Also read : China Spy Ship in Srilanka Port : భారత్‌ పై చైనా మరో భారీ కుట్ర..చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌక

శ్రీలంక ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న దగ్గరినుంచి ఆ దేశానికి అన్నివిధాలా అండదండగా ఉంది భారతే. చమురు సాయం నుంచి నిత్యావసరాల దాకా అన్నీ అందించింది. భారత్ సాయాన్ని దాతృత్వంగా చూడకూడదని..తిరిగి చెల్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని నెలన్నర రోజుల క్రితమే రణిల్ విక్రమ్‌సింఘే వ్యాఖ్యానించారు. భారత్ సాయం చేయకపోతే…శ్రీలంక పరిస్థితి ఇంకా దిగజారి ఉండేదని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. ఇలా కష్టకాలంలో శ్రీలంకకు భారత్ చేయూతనిస్తోంటే…ఆ దేశ పరిస్థితులను అడ్డుపెట్టుకుని..భారత్‌కు నష్టం కలిగించేందుకు డ్రాగన్ ప్రయత్నించింది. తాను నిర్మించిన, తన స్వాధీనంలో ఉన్న పోర్టు అన్న ఉద్దేశంతో హంబన్‌టోట పోర్టులోకి శ్రీలంక అత్యాధునిక నిఘానౌక యువాన్ వాంగ్ 5ను పంపేందుకు వ్యూహరచనచేసింది.

ఈ పోర్టు చైనా ఆధీనంలో ఉండడంతో శ్రీలంక ఏమీ చేయలేకపోయింది. అయితే భారత్ శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. హిందూ మహా సముద్ర జలాల్లో పరిశోధనల కోసమే ఈ నౌకను పంపుతున్నామని చైనా చెబుతున్నప్పటికీ..డ్రాగన్ అసలు ఉద్దేశం శ్రీలంకకు తెలుసు. షెడ్యూల్ ప్రకారం ఈ నౌక ఈ నెల 11న హంబన్‌టోటలోకి అడుగుపెట్టాల్సి ఉంది. వారం రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 17న తిరిగి బయలుదేరాల్సి ఉంది.యువాన్ వాంగ్ అక్కడకు వస్తే…బాలాసోర్ నుంచి ప్రయోగించిన క్షిపణుల సమస్త సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగాలను నియంత్రించగలదు. దీంతో ఈ నౌక పర్యటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

China Spy Ship ‘Yuan Wang 5’ : చైనా నిఘా నౌక వల్ల భారత్ కు ఎటువంటి ప్రమాదం..?

రెండు రోజుల క్రితం జియాన్ జిన్ నుంచి బయలుదేరిన తమ నౌక హంబన్‌టోట్‌లో నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని చైనా శ్రీలంకను కోరింది. దీనిపై స్పందించిన శ్రీలంక విదేశాంగమంత్రిత్వ శాఖ…కొలంబోలోని చైనా ప్రతినిధికి లేఖ రాసింది. యువాన్ వాంగ్ నౌక పర్యటనను వాయిదావేసుకోవాలని విజ్ఞప్తిచేసింది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే కూడా రెండు రోజల క్రితం నౌక పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉండబోదని ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి గొటబయ దిగిపోవడానికి ఒక్కరోజు ముందు ఈ నౌకకు గొటబయ అనుమతిచ్చారు. తన పాలనాకాలంలో భారత్‌ను కాదని చైనాతో అంటకాగిన రాజపక్స కుటుంబం పదవిలో చివరిక్షణం వరకు డ్రాగన్‌కు విశ్వాసపాత్రంగా వ్యవహరించింది. మారిన పరిస్థితుల్లో భారత్‌తో స్నేహం కోసం శ్రీలంక చైనాకు చెక్ చెప్పింది.

 

ట్రెండింగ్ వార్తలు