Covid affected brain function : దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి మెదడు పనితీరులో రెండేళ్లపాటు ఇబ్బందులు తప్పవట

కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

Covid affected brain function

Covid affected brain function : కోవిడ్ నుంచి ప్రపంచం తేరుకున్నా దాని తాలూకు అనారోగ్య సమస్యలు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. 12 వారాల పాటు దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడిన వ్యక్తులు కనీసం రెండేళ్లపాటు మెదడు పనితీరుతో ఇబ్బందులు పడుతూనే ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

COVID-19 Update : ప్రస్తుతం కోవిడ్-19 లక్షణాలు ఎలా ఉన్నాయి? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డాక్టర్లు ఏం చెబుతున్నారు?

కోవిడ్ సోకిన తరువాత కనీసం 12 వారాల పాటు దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తుల్లో మెదడుకి సంబంధించిన ఇబ్బందులు రెండేళ్లపాటు కొనసాగుతాయని యునైటెడ్ కింగ్ డమ్ లో ప్రచురించిన పరిశోధనలు చెబుతున్నాయి. తిమ్మిరి, జలదరింపు, తలనొప్పి, మైకము, అస్పష్టమైన దృష్టి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయట. కోవిడ్ మెదడు పనితీరును ఎలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవడానికి పరిశోధకులు వేలాదిమందిని పరీక్షించడానికి ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌కు పిలిచారు.

Covid-19 Lockdown : కోవిడ్ ముప్పు మంచు కొండల మంచి కోసమే .. పరిశోధనల్లో వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీర్ఘకాల కోవిడ్ లక్షణాలను వివరించారు. యునైటెడ్ స్టేట్స్‌లో లక్షలాదిమంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారట. దీర్ఘకాల కోవిడ్ లక్షణాలలో అలసట, శ్వాసకోశ , గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. 2021 లో కింగ్స్ కాలేజ్ లండన్ లోని పరిశోధకులు సైతం ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించి 3,335 మంది ని గమనించారట. 12 వారాలు లేదా అంతకంటే దీర్ఘ కాలిక కోవిడ్ లక్షణాలు అనుభవించిన వారు గణనీయంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు పరిశోధనలో తేలింది.

 

ట్రెండింగ్ వార్తలు