Terrifying Video: జిమ్ లో యువతిపై దాడికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తి

జిమ్ లో ఓ యువతి వ్యాయామం చేస్తోంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జిమ్ డోర్ వద్ద నిలబడ్డాడు. అతడు కూడా జిమ్ చేయడానికి వచ్చాడని అనుకున్న ఆ అమ్మాయి డోరు తెరిచింది. అనంతరం మళ్లీ జిమ్ లో వ్యాయామం కొనసాగిస్తోంది. ఇంతలో ఆ యువతి వద్దకు ఆ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆమెపై దాడి చేయబోయాడు.

Terrifying Video: జిమ్ లో ఓ యువతి వ్యాయామం చేస్తోంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జిమ్ డోర్ వద్ద నిలబడ్డాడు. అతడు కూడా జిమ్ చేయడానికి వచ్చాడని అనుకున్న ఆ అమ్మాయి డోరు తెరిచింది. అనంతరం మళ్లీ జిమ్ లో వ్యాయామం కొనసాగిస్తోంది. ఇంతలో ఆ యువతి వద్దకు ఆ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆమెపై దాడి చేయబోయాడు.

దీంతో ఆ యువతి ప్రతిఘటించింది. ఆ ఇద్దరూ జిమ్ లోనే కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, వివరాలు తెలిపారు.

నషాలి అల్మా (24) జిమ్ లో ఉండగా ఆమెపై జేవియర్ థామస్-జోన్స్ అనే యువకుడు దాడి చేయడానికి యత్నించాడని అన్నారు. ఫ్లోరిడాలోని టంపా నగరంలోని ఇన్వుడ్ పార్క్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ యువకుడు ఎందుకు దాడి చేశాడన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

IT Raids On BBC : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన

ట్రెండింగ్ వార్తలు