1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

1765 నాటి ‘గాలితో శిల్పం’..రూపొందించారు. ఈ గాలి శిల్పాన్ని త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శనలో ఉంచనున్నారు.

Sculpture Created From 1765 Antarctic ABy Vincent Dowd : గాలి.జీవకోటి బతకాలి అంటే గాలి కావాలి. అదే ప్రాణాధారం. ఒక్కక్షణం గాలి స్థంభించిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే కష్టం. ఒక్క నిమిషం గాలి పీల్చుకోకుండా శ్వాసను బిగబట్టండి..ప్రాణం పోయినట్లేననిపిస్తుంది. జీవకోటిని బతికించే గాలికంటికి కనిపిస్తుందా?కనిపించదు. కానీ జీవితాలకు అదే ఆధారం. ప్రస్తుతం గాలి కాలుష్యం గురించి చెప్పుకుంటున్నాం. కలుషితమైన గాలినిపీల్చుకోవటం ద్వారా ఎన్ని వ్యాధులు వస్తున్నాయో వింటున్నాం. కానీ అసలు కలుషితమే కానీ గాలి ఉంటే ఎంత బాగుంటుందో కదూ. కానీ అటువంటి గాలి ఎక్కడుంటుంది? దాన్ని పట్టి బంధించి మనం తెచ్చేసుకుంటే ఎంచక్కా..ఎటువంటి సమస్యలు రావుకదూ..కానీ అది అసాధ్యం. గాలిని ఎవ్వరైనా బంధించగలరా? ఏదో బుడగలు ఊది కాసేపు దాన్ని బంధిస్తాం. కానీ అది ఎక్కువసేపు ఉండదు. కానీ గాలిని బంధిస్తే..!ఆ గాలితో ఓ శిల్పాన్ని రూపొందిస్తే..!! ఏంటీ గాలితో శిల్పామా? నిజమే అని కళ్లు పెద్దవి చేసి చూస్తాం. ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో ఏదైనా సాధ్యమే..ఓ కళాకారుడు అద్భుతాన్ని సృషించాడు. ‘గాలితో శిల్పాన్ని’ రూపొందించాడు. అదికూడా 1765కు ముందు గాలితో..ఈ శిల్పాన్ని రూపొందించాడు.

పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం కలుషితంగా మారిపోతోంది. కానీ గాలి కాలుష్యం కాకముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? వాటి గురించి తెలుసుకోవటం ఎలా? అనే ప్రశ్నల నుంచి రూపొందిందే ఈ ‘గాలి శిల్పం’ కళాకారుడు, రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ పీహెచ్‌డీ అభ్యర్థి వేన్‌ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి దాన్ని స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్‌–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శనకు ఉంచనున్నారు.

అంటార్కిటికా ఐస్‌ నుంచి..గాలి సేకరణ..
ఈ శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే సైంటిస్టులతో కలసి పీహెచ్ డీ అభ్యర్తి బినిటీ 5 సంవత్సరాల పాటు ఆ మంచు ఖండంలో గడిపాడు. మంచుని డ్రిల్లింగ్‌ చేసి..170 మీటర్ల లోతు వరకూ తవ్వారు. ఆ కింద ఉండే మంచును సేకరించారు. ఆ మంచు పలు విధాలుగా విశ్లేషించి డబ్బాల్లో నింపి ఉంచారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

దీని గురించి బినిటీ మాట్లాడుతు.. ‘‘నా కళ.. హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్‌ పరిస్థితులను తెలుపుతుందనీ..మంచుతో కూడిన ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుందని అని ఆశాభావం వ్యక్తంచేశాడు. లిక్విడ్‌ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్‌ సిలికాన్‌ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్‌ సామర్థ్యాలతో బీఏఎస్‌ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు.

Read more :Nusret Gokse Salt Bae Bill : సింగిల్‌ మీల్‌ రూ.1,80,000..అయినా ఆ రెస్టారెంటుకు క్యూ కడుతున్న కష్టమర్లు..ఎందుకంటే..

1765 కీలకమైన సంవత్సరం
దీని గురించి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే( బీఏఎస్‌) శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్‌ కంపోజిషన్‌ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చని..10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. అప్పటి నుంచి ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్‌ ఉండేది. ఆ దశకంలో జేమ్స్‌ వాట్‌ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్‌ డైయాక్సైడ్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చని ముల్వానే తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు