Viral Video: నార్వేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తుఫాను.. భారీ వరదలకు కొట్టుకుపోయిన మొబైల్ ఇళ్లు

వరద హెచ్చరికల అనంతరం వందలాది మందిని మంగళవారమే అత్యవసవర సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నోర్దిక్ ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం వ్యాపించింది.

Norway Floods: నార్వే దేశంలో హన్స్ తుఫాను విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాలు కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలతో దేశ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా ప్రతిచోటా విధ్వంసం దృశ్యాలు కనిపిస్తున్నాయి. హన్స్ హరికేన్ కారణంగా నార్వేలో వరదలు సంభవించి రెండు మొబైల్ ఇల్లు కొట్టుకుపోయిన ఘటనల నార్వే పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆ ప్రాంతంలో నిల్చున్న వ్యక్తులు ఈ ఘటనను కెమెరాలో బంధించడం తప్ప మరేమీ చేయలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వరద హెచ్చరికల అనంతరం వందలాది మందిని మంగళవారమే అత్యవసవర సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నోర్దిక్ ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం వ్యాపించింది. అలాగే రోడ్లు తెగిపడటం, వాగులు, నదులు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. స్వీడన్ దేశంలో ఆదివారం ఏర్పడిన హన్స్ హారికేన్ తుఫాను.. సోమవారం నాటికి నార్వే దేశాన్ని చేరుకుని ఆ దేశాన్ని కుదిపివేసింది. దక్షిణ నార్వేలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు