అయితే మాడుపగిలే ఎండలు, లేదంటే ముంచేసే వరదలు.. ఎందుకిలా? భూమి మీద అసలేం జరుగుతోంది?

ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?

Climate Changes : భూమి మీద అసలేం జరుగుతోంది? అయితే భరించలేని ఎండలు.. లేదంటే ఇళ్లు, వాకిళ్లు ఊడ్చిపడేసే వరదలు. శీతాకలం వచ్చిందంటే ఎముకలు కొరికే చలి. వేసవి కాలం మొదలు కాకముందే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు. రాత్రి వేళల్లో కూడా ఉడికిపోయే వేడి. ఎందుకు ఇదంతా? వాతావరణం ఇలా ఎలా మారిపోయింది.

వడగాలులు, కుండపోత వర్షాలు, గడ్డకట్టుకుపోయేంత చల్లదనం. ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం ఒక్కటే. గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రభావంతోనే ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఉన్నాయి.

ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దుబాయ్ ను వరదలు ముంచెత్తాయి. కెనాడును కార్చిచ్చు దహించి వేస్తోంది. అమెరికాలో ఒకపక్క వరదలు ముంచెత్తుతుంటే, మరోపక్క ఎండలు దంచికొడుతున్నాయి. హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల బారినపడి ఇప్పటివరకు 550మంది చనిపోయారు. వాతావరణ మార్పులతో 2049 నాటికి 38 ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని ఒక సర్వే తేల్చింది.

పూర్తి వివరాలు..

Also Read : ఢిల్లీలో ఎండ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం.. 192 మంది నిరాశ్రయులు మృతి

ట్రెండింగ్ వార్తలు