UK ‘Mystic Veg’ : ఉల్లికాడలతో జోస్యం..బ్రిటన్​ కాబోయే ప్రధాని ఎవరో చెప్పేసిన ‘మిస్టిక్​ వెజ్​’

ఉల్లికాడలతో జోస్యం చెప్పే ‘మిస్టిక్​ వెజ్​’ గా పేరున్న ఓ 66 ఏళ్ల మహిళ బ్రిటన్​ కాబోయే ప్రధాని ఎవరో చెప్పేసింది. ఆమె ఎవరంటే..

UK ‘Mystic Veg’ : అది ఒకప్పటి రవి అస్తమించని సామ్రాజ్యానికి నేతృత్వం వహించిన ద గ్రేట్ బ్రిటన్. ఈ బ్రిటన్ ప్రధాని పీఠానికి అధిరోహించేది ఎవరు? అనేది ఇప్పుడు తాజా చర్చ. బోరిస్ జాన్సన్‌ రాజీనామాతో బ్రిటన్‌ ప్రధాని రేసు మొదలైంది.. ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐతే భారతీయ మూలాలున్న రిషి సునక్‌.. పోటీలో ముందు ఉన్నారు. మనల్ని పాలించిన ఇంగ్లీష్‌వాళ్లను.. మనోడు అంటే భారతీయ మూలాలున్న వ్యక్తే పాలించే సమయం వచ్చిందా..? చరిత్రలో సువర్ణాక్షరాలతో ఓ అధ్యాయం లిఖించాల్సిన సమయం ఆసన్నమైందా..? ఆ పార్టీ ఎంపీలకు సునక్ ఎందుకు అంత స్పెషల్‌ ? అనే చర్చ కూడా తీవ్రంగా కొనసాగుతున్నవేళ..బ్రిటన్​ కాబోయే ప్రధాని ఎవరో చెప్పేసారు యూకేలో ‘మిస్టిక్​ వెజ్​’ గా పేరెన్నికగన్న జ్యోతిష్యురాలు..!

జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నమ్ముతారు. ఇప్పుడు అదే జోస్యంతో బ్రిటన్ ప్రధాని ఎవరో చెప్పారు ఉల్లికాడల వంటి ఆకు కూర కాడలతో జోస్యం చెప్పే ‘మిస్టిక్​ వెజ్​’..!! ఆమె పేరు ‘జెమీమా పాకింగ్ టన్’..! కారణమేదైనా గానీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే రాజీనామా చేశారు. మరి కొత్త ప్రధాని ఎవరు అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇటువంటి సమయంలో ‘జెమీమా పాకింగ్ టన్’ అనే మహిళ సరికొత్త జోస్యంతో మరోసారి తెరపైకి వచ్చింది.

Also read : Baba Vanga :‘పుతిన్ ప్రపంచానికి రాజు అవుతాడు..రష్యా ఈ లోకాన్ని శాసించబోతోంది..దీన్నిఎవరూ ఆపలేరు’ : బాబా వంగా జోస్యం

యూకేకు కాబోయే ప్రధాని ‘బెన్ వాలేస్’ అంటూ ప్రకటించింది. 66 ఏళ్ల ‘జెమీమా పాకింగ్ టన్ యూకేలో ‘మిస్టిక్ వెజ్’ గా పేరెన్నికగన్న జ్యోతిష్యురాలు మరి. ఆమె జోస్యం చెప్పింది అంటే జరిగితీరుతుంది అనే నమ్మకం ఉంది. ఆమె గతంలో చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయి. దీంతో ఆమె చెప్పే విషయాలు అంత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు.. ఆమె జ్యోతిష్యం చెప్పే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. ఆస్పరాగస్ (ఉల్లికాడల్లా ఉండే ఓ రకం ఆకుకూరలా ఉండే) కాడలను పాచికల్లా వేసి ఆమె జోస్యం చెబుతుంది.

యూకేలో జెమీమా పాకింగ్ టన్ చెప్పే ఆస్పరాగస్ జోస్యం బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడే కాదు.. ఇంతకుముందు బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని అవుతాడని, ప్రిన్స్‌ ఫిలిప్‌ చనిపోతాడని, రాయల్‌ ఫ్యామిలీ నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ మార్కెల్ తప్పుకుంటారని కూడా ఆమె జోస్యం చెప్పింది. అవన్నీ నిజం కావడంతో ఆమె జోస్యంపై బాగా నమ్మకం ఏర్పడింది. దీంతో ప్రచారం కూడా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఆమె యూకే ప్రధాని అవుతారని చెబుతున్న ‘బెన్ వాలేస్’ ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్నారు.


ఆస్పరాగస్‌ తో జోస్యం చెప్పేది ప్రపంచంలో 66 ఏళ్ల జెమీమా ఒక్కరే. ఆమెకు ఎనిమిది ఏళ్లు ఉన్నప్పటినుంచే భవిష్యత్‌ చెప్పడం మొదలుపెట్టింది. ఎలాగంటే..తేయాకు ఆకులతో భవిష్యత్‌ చెప్పే తన అత్త దగ్గరి నుంచి ఈ జోస్యం నేర్చుకున్నానని ఆమె చెబుతూ ఉంటుంది. ఈమె ఇదే కాదు, ఇంకా చాలా చెబుతున్నారు. బ్రిటన్ లేబర్‌ పార్టీ నాయకుడిగా సర్‌ కెయిర్‌ స్టార్మర్‌ ఎక్కువ కాలం ఉండబోరని, రాయల్‌ ఫ్యామిలీ మరింత విషాదం చూడబోతోందని, మరిన్ని అభియోగాలు ఎదుర్కోబోతోందని కూడా ఆమె జోస్యం చెబుతోంది. మరి ‘మిస్టిక్​ వెజ్​’..పేరున్న ‘జెమీమా పాకింగ్ టన్’ జోస్యం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి..!!

ట్రెండింగ్ వార్తలు